[ad_1]
అంతర్జాతీయ
ఓయ్-చంద్రశేఖర్ రావు
రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించిన అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోక్ సభ ఆమోదించిన సమయంలో మావిగన్ ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు (మావిగన్) ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించారు.
చాలా ఆచరణాత్మకంగా ఆలోచించి ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రానికి మంచి చేయాలనే ఉద్దేశంతో గతంలో తాము సూచించిన ప్లాన్- ఏ అధికార తెలుగుదేశం కూటమికి నచ్చలేదని, ఇప్పుడు ప్లాన్- బీగా మావిగన్ ను ప్రతిపాదించామని వివరించారు. మచిలీపట్నం- విజయవాడ 70 కిలో మీటర్లు, విజయవాడ- గుంటూరు మరో 40 కి.మీల పరిధిని రాజధానిగా ప్రకటించాలని సూచించారు. మచిలీపట్నం పోర్ట్ సిటీ కావడం వల్ల రాజధాని వేగంగా, పరిమిత నిర్మాణ ఖర్చుతోనే అభివృద్ధి చెందుతుందని అన్నారు.

మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు మధ్య 110 కి.మీ నేషనల్ హైవే అటు, ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయాలని, అమరావతిలో పెట్టే రూ. 2 లక్షల కోట్లలో 10 శాతం పెట్టినా చాలని సూచించింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం రింగ్ రోడ్లు, ఇతరత్రా పనుల కోసం, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10 శాతం పెడితే చాలు ఈ ప్రాంతం మొత్తం కూడా ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుందని అన్నారు.
నిజానికి- మావిగన్ తరహా కనెక్టెడ్ ఇండస్ట్రీయల్ కారిడార్ సిటీలు ఇతర దేశాల్లో చాలానే ఉన్నాయి. చైనాలో బీజింగ్-టియాంజిన్-హెబీ లను కలుపుతూ జింగ్-జిన్-జీ పేరుతో ఇండస్ట్రీయల్ కారిడార్ ఉంది. ఇదొక ప్లాన్ మెగా సిటీ. రాజకీయ, సాంస్కృతిక, పారిశ్రామిక కార్యకలాపాలు ఒకే సూపర్ రీజియంగా ఏకీకృతం చేయడమే దీని లక్ష్యం. సమగ్ర రవాణా, ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ, అధిక జనాభా సాంద్రతలతో కూడిన ప్రపంచ మెగా ప్రాంతాలలో ఇది ఒకటి.
అలాగే షాంఘైని కేంద్రంగా చేసుకుని, ఆర్థిక, వాణిజ్య, అధునాతన తయారీ రంగాలపై కేంద్రీకృతమైన మరో మెగాసిటీ క్లాస్టర్ యాంగ్జీ రివర్ డెల్టా. చైనా పెర్ల్ రివర్ డెల్టా/గ్రేటర్ బే ఏరియాలు కూడా ఇటువంటివే. హాంకాంగ్, షెన్జెన్, గ్వాంగ్జౌ నగరాలను కనెక్ట్ చేయండి దీన్ని నిర్మించారు. టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్‌కు ఈ రీజియన్ అత్యంత కీలకం.
జపాన్ లో ఇటువంటి కనెక్ట్ సిటీస్ కారిడార్ ఉంది. రాజధాని టోక్యో బే ఏరియా నుండి పోర్ట్ సిటీ యోకోహామాను కలిపే కారిడార్ ఇది. జపాన్ లో ప్రధాన పారిశ్రామిక, లాజిస్టిక్స్ హబ్ గా పేరొందింది. యోకోహామా బే బ్రిడ్జి దీనికి ప్రధాన ఆధారం. షూటో ఎక్స్‌ప్రెస్‌వే బేషోర్ రూట్, నేషనల్ రూట్ 357 వంటి కీలక మౌలిక సదుపాయాలు హన్మోకు ఫూరో, డైకోకు ఫుటో, అలాగే సెంట్రల్ టోక్యోల మధ్య భారీ పోర్ట్ ట్రాఫిక్‌ను సులభతరం చేస్తోంది. ఈ కారిడార్ కవాసాకి వద్ద టోక్యో బే అక్వాలైన్ను కలుపుకొని కనగావాను చిబాకు అనుసంధానిస్తుంది.
అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో బేరియా కూడా ఇటువంటిదే. టెక్-సెంటెర్డ్ గా ఇది ప్రసిద్ధి చెందింది. శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ జోస్, ఓక్లాండ్లను అనుసంధానిస్తుందీ కారిడార్. బోస్టన్- వాషింగ్టన్ డీసీ మావిగన్ వంటిదే. ఉత్తర- ఈశాన్య ప్రాంతాలను కలిపే రీజియన్ ఇది. చికాగో- పిట్స్ బర్గ్ ను అనుసంధానిస్తూ మిడ్ వెస్ట్ కనెక్షన్ పేరుతో ఓ కారిడార్ అందుబాటులో ఉంది. ఆయా కారిడార్లన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందాయి. ఆయువు పట్టుగా నిలిచాయి.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird