Home ట్రెండింగ్ ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి | అమరావతిపై చట్టబద్ధతపై చట్టపరమైన అనిశ్చితి మరియు ఆర్థిక సాధ్యత అవసరం, విజయసాయి రెడ్డి – VRM MEDIA

ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి | అమరావతిపై చట్టబద్ధతపై చట్టపరమైన అనిశ్చితి మరియు ఆర్థిక సాధ్యత అవసరం, విజయసాయి రెడ్డి – VRM MEDIA

by VRM Media
0 comments
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి | అమరావతిపై చట్టబద్ధతపై చట్టపరమైన అనిశ్చితి మరియు ఆర్థిక సాధ్యత అవసరం, విజయసాయి రెడ్డి


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-చంద్రశేఖర్ రావు

రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించిన అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోక్ సభ ఆమోదించిన సమయంలో మావిగన్ ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు (మావిగన్) ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించారు.

అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి తెర మీదికి వచ్చారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా రాజకీయంగా మాత్రమే పరిష్కారమైన అంశమని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి ఉద్దేశించిన ఏపీ పునర్విభజన చట్టం లోక్ సభలో ఆమోదం పొందిన న్యాయపరంగా ఎదురయ్యే సవాళ్లు చిక్కుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అమరావతి విజయసాయి రెడ్డిపై చట్టబద్ధతపై చట్టపరమైన అనిశ్చితి మరియు ఆర్థిక సాధ్యత అవసరం

అమరావతి లోక్ సభలో చట్టబద్ధత కల్పించడంతో ఈ సమస్య ముగిసినట్టు కాదని సాయిరెడ్డి అన్నారు. లీగల్ గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయనీ వివరించారు. చట్టంగా రూపుదాల్చినట్లు భవిష్యత్ లో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. వీటిని చంద్రబాబు తాను సూచించిన అంశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం ఆరు అంశాలతో కూడిన ట్వీట్ ను కొద్దిసేపటి కిందటే పోస్ట్ చేశారు సాయిరెడ్డి.

పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ద్వారా అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయించడంపై తీవ్ర చట్టపరమైన సమస్యలు ఉన్నాయని, ఇందులో ప్రధానమైనది రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రానికే ఉంటుందని 2020లో ఏపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని సాయిరెడ్డి గుర్తు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 3, 4 పునర్వ్యవస్థీకరణకు మాత్రమే అనుమతిస్తాయే లేదా శాశ్వత రాజధానిని నిర్ణయించడానికి కాదని ఆయన పేర్కొన్నారు.

తన రాజధానిని తానే నిర్ణయించుకునే హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన విధి అని సాయిరెడ్డి. అది ఇన్సిడెంటల్ మ్యాటర్ కానే కాదని అన్నారు. చట్టం చేయడం ద్వారా రాజధానిని నిర్ణయించడం అనేది ఫెడరల్ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించినట్టే, దీనివల్ల రాష్ట్రాన్ని, అక్కడి పరిపాలనను కేంద్రం ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకున్నట్లు, కేంద్రం నియంత్రిత యూనిట్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు.

అమరావతిని ఎంపిక చేయడానికి ఎటువంటి సంప్రదింపులు గానీ, ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ గానీ జరగలేదని ఆయన గుర్తు చేశారు. ఇది ఏకపక్ష నిర్ణయంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఏ పునర్వ్యవస్థీకరణ చట్టం కూడా గతంలో రాజధానులను నిర్ణయించలేదని, ఆ అధికారాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలివేశారని అన్నారు.

కేంద్రం అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించడాన్ని సవాల్ చేస్తూ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే రద్దయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని అంచనా వేశారు. దీనివల్ల పాలనలో సంస్థాగత అస్థిరత ఏర్పడుతుందని అన్నారు. ఒక రాజధాని ఆర్థిక, పరిపాలనా సాధ్యాసాధ్యాలు, ప్రజా పెట్టుబడుల నుండి ఉద్భవించాలి తప్ప, చట్టబద్ధమైన నిర్బంధం ద్వారా కాదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.



2,801 Views

You may also like

Leave a Comment