Home ట్రెండింగ్ మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! | ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం కారణంగా సరఫరా గొలుసు అంతరాయాల కారణంగా మద్యం ధరలు 12-15% పెరుగుతాయని అంచనా. – VRM MEDIA

మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! | ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం కారణంగా సరఫరా గొలుసు అంతరాయాల కారణంగా మద్యం ధరలు 12-15% పెరుగుతాయని అంచనా. – VRM MEDIA

by VRM Media
0 comments
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! | ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం కారణంగా సరఫరా గొలుసు అంతరాయాల కారణంగా మద్యం ధరలు 12-15% పెరుగుతాయని అంచనా.


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

మందుబాబుకు భారీ షాక్. మద్యం.. బీర్ల ధరలు భారీగా పెంచేందుకు రంగం సిద్దమైంది. యుద్ధం ప్రభావం మద్యం పైన పడింది. ఇప్పటికే మద్యం తయారీ కంపెనీలు తమ ప్రతిపాదనలతో పెంపు పైన నివేదికలు అందించబడ్డాయి. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకోనుంది. దాదాపు 12-15 శాతం వరకు పెంచుతూ కొత్త రేట్లు ఖరారు చేస్తున్నారు. పెంపు ముహూర్తం దాదాపు ఫిక్స్ అయింది. దీంతో.. ఇక, మందు బాబులకు కొత్త ధరలతో ఇక మందు తాగాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఇరాన్ యుద్ధం ప్రభావం మందుబాబుల జేబులపై పడనుంది. మద్యంతోపాటు బీర్ల ధరలు మే నెలలో పెంచేందుకు రంగం సిద్దం అవుతోంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకొకసారి మద్యం ధరలను సమీక్షిస్తారు. చివరిగా 2023 మే నెలలో ధరలను పెంచగా.. నిబంధనల ప్రకారం 2025 మే నెలలో మళ్లీ ధరలను సమీక్షించాల్సి ఉంది. ప్రస్తుత గడువు ఎప్పుడో ముగిసింది. యుద్ధం వల్ల సహజ వాయువు (నేచురల్‌ గ్యాస్) సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో మద్యం సీసాల ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. అలాగే సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడ్డాయి. కొన్ని యూనిట్లు పూర్తిగా మూతపడ్డాయి. ఫలితంగా దేశంలోని ప్రధాన గాజు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి ఏకంగా 40 శాతం పడిపోయింది. ఫలితంగా ఖాళీ సీసాల ధరలు 20 శాతం వరకు పెరిగాయి. ఈ అదనపు భారాన్ని భరించలేకపోతున్నామని.. వెంటనే మద్యం ధరలు పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులు కలిసిన తయారీదారులు మద్యం ధరలను 12- 15 శాతం వరకు పెంచాలని వినతి పత్రం కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ధరల పెంపునకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

12-15 నాటికి-ఇరాన్-ఇస్ఆర్-కారణంగా-సరఫరా-గొలుసు-అంతరాయాల కారణంగా-మద్యం-ధరలు-పెరుగుదల-అంచనా.

మద్యం ధరల పై తుది కసరత్తు

కాగా, ఈ అంశంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం.. ఓ రిటైర్డ్‌ జడ్జితో కూడిన జ్యుడీషియల్‌ కమిటీని నియమించింది. ఆ కమిటీ ధరల పెంపు పరిశీలన లోతుగా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, మద్యం తయారీ సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ధరలు పెంపు ఖాయంగానే ఉన్నాయి. అయితే, మద్యం పెంపును స్లాబులుగా విభజించి అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. బాటిల్‌ సైజ్‌ (90 ఎంఎల్‌/ 180 ఎంఎల్‌/ 375ఎంఎల్‌/ 750 ఎంఎల్‌), బ్రాండ్‌/ ప్రైస్‌ రేంజ్‌ స్లాబ్‌ (లో కాస్ట్‌ లిక్కర్‌, మిడ్‌ రేంజ్‌, ప్రీమియం బ్రాండ్‌లు), ట్యాక్స్‌ స్లాబ్‌ స్ట్రక్చర్‌ని ఆధారంగా చేసుకుని ధరల పెంపునకు గురైంది. రిర్డ్‌ జడ్జి ప్రతిపాదన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం మే నెలలో కొత్త ధరలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. వేసవిలో బీర్లకు డిమాండ్‌ 30 శాతం వరకు పెరుగుతున్న తరుణంలో సరఫరా మాత్రం 20 శాతం మేర తగ్గడం మార్కెట్‌లో కొరతకు దారితీస్తోంది.

2,801 Views

You may also like

Leave a Comment