Home Uncategorized “పుష్పయాగంలో భక్తి పరిమళాలు –

“పుష్పయాగంలో భక్తి పరిమళాలు –

by VRM Media
0 comments

శ్రీ కోదండరాముని దివ్య అర్చన వైభవం”

ఏప్రిల్ 5 ఒంటిమిట్ట VRM న్యూస్ ఒంటిమిట్ట

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం భక్తి భరితంగా నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, ఆలయ శుద్ధి, నిత్యారాధనలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభవంగా ప్రారంభమైంది.
తులసీదళాలు, మల్లెలు, రోజాలు, చామంతులు, గన్నేరు, సంపంగి, మొగలి దళం వంటి పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు 3 టన్నుల పుష్పాలు విరాళంగా అందాయి.
ప్రకృతి వైపరీత్యాలు తొలగి భక్తులు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తూ, భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహిస్తారు. అలాగే నిత్యకైంకర్యాలలో తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ యాగాన్ని చేస్తారని అర్చకులు తెలిపారు.
ఈ యాగం ద్వారా దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ సదాశివ రావు, డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్, ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

2,808 Views

You may also like

Leave a Comment