
తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
తెలంగాణలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కొత్త పొత్తులు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు సమీకరణలను మార్చేస్తున్నాయి. దీంతో, రానున్న గ్రేటర్ తో సహా అన్ని ఎన్నికల్లో కొత్త పొత్తులు ఖాయమనే చర్చ మొదలైంది. గ్రేటర్ ఎన్నికల్లో ఏపీ తరహాలో ఎన్డీఏ పొత్తు ఉంటుందని కొంత కాలంగా పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. ఈ పొత్తుల చర్చ వేళ బీజేపీ చీఫ్ తమ విధానాన్ని స్పష్టం చేసారు. పొత్తుల లెక్కల పై క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. రాబోయే జీహెంకి ఎన్నికల్లో 3 మేయర్ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుందనే ధీమా వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, ఆ వైఫల్యాలను సమీక్షించి లోపాలను సవరించుకున్నామని. ప్రపంచ దేశాలన్నీ యుద్ధభయంతో భయపడు తుంటే..దేశ ప్రజలు మోదీ నాయకత్వంలో ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారని రాంచందర్ రావు అన్నారు. లాక్ డౌన్ విధించే అవకాశం లేదు. ఎక్కడ ఎన్నికలు జరిగినా, రాహుల్ గాంధీకి రూ.1000 కోట్లు ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన దేశంలో గుర్తింపు పొందారు. సీఎం మొదటగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి, పరిపాలనపై దృష్టిసారించాలని సూచించారు.

తెలంగాణలో ఒంటరి పోరుకే బీజేపీ మొగ్గు
అదే విధంగా హైడ్రా పేరుతో ప్రభుత్వం సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోందని అధికారం, లో కి వచ్చాక కూల్చివేతలే తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి, డొక్కు బస్సులను నడపడం వల్ల ఆర్టీసీ వ్యవస్థ కుప్పకూ లింద ని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో గ్యాస్ కొరత సృష్టించడం వెనక రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఉందని రాంచందర్‌రావు వస్తువులు. ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ సాధించిన విజయం ప్రత్యేకమైనదని రాంచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కమలం వికసించిందని. కాంగ్రెస్ ఎత్తుగడలను చిత్తుచేస్తూ ఖానాపూర్ మున్సిపాలిటీపై కాషాయజెండా ఎగురవేయడం చరిత్రాత్మక విజయమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభివర్ణించారు. కాగా.. గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది.