Home ఎంటర్‌టెయిన్మెంట్ ఫోటోగ్రాఫర్ల తీరుపై విరుచుకుపడ్డ జాన్వీ కపూర్‌.. వైరల్ అవుతున్న కామెంట్స్ – VRM MEDIA

ఫోటోగ్రాఫర్ల తీరుపై విరుచుకుపడ్డ జాన్వీ కపూర్‌.. వైరల్ అవుతున్న కామెంట్స్ – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


– పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ బోల్డ్ రియాక్షన్

– ఫోటోల యాంగిల్స్ గురించి షాకింగ్ విషయాలు

– అలాంటి ఫోటోలు తీసి మళ్ళీ కామెంట్స్ చేస్తారా?

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటో షూట్‌లతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ, తాజాగా పాపరాజీల (సినిమా ఫోటోగ్రాఫర్లు) ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత విషయాలు, తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి వచ్చే నెగిటివ్ కామెంట్స్ చూస్తుంటే తనకు చాలా కోపం వస్తుందని ఆమె కుండబద్ధలు కొట్టింది.

సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ జిమ్ కి వెళ్ళినా, ఎయిర్ పోర్ట్ కి వెళ్ళినా పాపరాజీలు వారిని వదలకుండా వెంటాడుతారు. ఈ జాన్వీ ధరించే దుస్తులపై తరచూ విమర్శలు వస్తుంటాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ.. పాపరాజీల ఫోటోలు తీసేందుకు తప్పుబట్టింది. “నేను షూట్స్ చేస్తాను, అక్కడ నా లుక్ బాగుంటుంది. కానీ పాపరాజీలు ఎప్పుడెప్పుడా అని ఫోటోలు తీస్తే యాంగిల్స్ నుండి ఫోటోలు తీస్తారు. ఆ తర్వాత నెటిజన్లు ‘ఈమె హాట్‌గా లేదు, అందంగా లేదు’ అని కామెంట్ చేయడం చూస్తే చాలా బాధగా, కోపంగా అనిపిస్తుంది” అని ఆవేదన వ్యక్తం చేసింది.

ముఖ్యంగా మహిళా నటిమణుల విషయంలో కెమెరా యాంగిల్స్ మార్చి, క్లిక్ బైట్ కోసం అసభ్యకరంగా కనిపించేలా ఫోటోలు తీయడం సరైన పద్ధతి కాదని జాన్వీ అభిప్రాయపడింది. “నేను ఏం ధరించాలి అనేది నా ఇష్టం. కానీ నేను కంఫర్ట్‌గా లేని సమయంలో వింత వింత యాంగిల్స్ నుండి ఫోటోలు తీసి, మళ్ళీ వాటిపై నెగిటివ్ కామెంట్స్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు” అని ఆమె గట్టిగా స్పందించింది. గతంలో పాపరాజీలతో స్నేహపూర్వకంగా ఉండే జాన్వీ, ఇప్పుడు ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

జాన్వీ కెరీర్ విషయానికి వస్తే.. గత ఏడాది బాలీవుడ్‌లో ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అవుతోందనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆమె తన ఫోకస్ మొత్తం సౌత్ సినిమాలపై పెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర అప్‌డేట్‌లు చూస్తుంటే, ఇందులో జాన్వీ పవర్ ఫుల్ ఎమోషనల్ రోల్ పోషిస్తున్నట్లు చూపుతోంది.

జాన్వీ కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని, వారిని కేవలం ఆబ్జెక్టిఫై చేయకూడదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, సెలబ్రిటీ హోదా ఉన్నప్పుడు ఇలాంటివి సాధారణమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, తనపై వచ్చే విమర్శలను ధైర్యంగా ఎదుర్కోవడంలో జాన్వీ ఎప్పుడూ ముందుంటుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌తో పూర్తి స్థాయిలో ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల జారీ. టాలీవుడ్‌లో ఈ మూవీ కనుక హిట్ అయితే, జాన్వీ ఇక్కడ టాప్ హీరోయిన్ల సరసన చేరడం ఖాయం. హిందీలో కూడా కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. తన సినిమాలతో పాటు ఇలాంటి బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో జాన్వీ ఎప్పుడూ వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.

2,806 Views

You may also like

Leave a Comment