VRM media అయినవిల్లి భద్రం రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం రాజానగరం గ్రామంలో *నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ
నీరు - ప్రగతి- జల హారతి నినాదంతో సాగునీటి సంఘాల బలోపేతం చేస్తూ ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు జల వనరులను పెంపొందించి కోవాలనే దృఢ సంకల్పంతో నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత అనే భారీ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని ఇందులో అందరూ భాగస్వాములు కావాలని రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు.
రైతులకు సాగునీటి ఎద్దడి లేకుండా చూడాలనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక "జలధార" కార్యక్రమం కోరుకొండ మండలంలో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి, అధికారికంగా ప్రారంభించారు. వీరితో పాటు రాజమండ్రి ఆర్డీవో, ఇరి గేషన్ అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ… "నీటి భద్రత - సాగు నీటి సంఘాల బాధ్యత" అనే నినాదంతో రైతుల పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీరు అందాలనే ఉద్దేశంతో ఈ పూడికతీత పనులు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. ఎండకాలంలో కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించి (పూడికతీత పనులు), రాబోయే వర్షాకాలం మరియు సాగు సమయానికి నీటి ప్రవాహం సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.. ఈ పనుల వల్ల సాగునీరు వృధా కాకుండా ప్రతి ఎకరాకూ అందుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా స్థానిక కూలీలకు పనులు కల్పిస్తూనే, గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతమైన జలవనరుల అభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు , రైతులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.



VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird