Home Uncategorized ఆధ్యాత్మిక పర్యాటక హబ్ గా ఒంటిమిట్ట

ఆధ్యాత్మిక పర్యాటక హబ్ గా ఒంటిమిట్ట

by VRM Media
0 comments

స్టేట్ టెంపుల్ గా మారిన ఒంటిమిట్ట అభివృద్ధికి శ్రీకారం

రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి చమ్మర్థి

ఒంటిమిట్ట VRM న్యూస్ బాల మౌలాలి ఏప్రిల్ 6

ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం ‘నా భూతో నా భవిష్యతి’గా నిర్వహించాం- తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్రాజు
లోక కళ్యాణార్థం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహణ
టీటీడీ, జిల్లా యంత్రాంగం సమిష్టి కృషిస్టేట్ టెంపుల్‌గా మారిన తర్వాత వేగవంతమైన అభివృద్ధి
శ్రీరామ ఎత్తిపోతల పథకంతో కరువు నివారణ భక్తుల కోసం అదనపు సౌకర్యాలు – కాటేజీల నిర్మాణం
గ్రీన్ ఫీల్డ్ హైవేతో రవాణా సౌకర్యాల మెరుగుదల
ఒంటిమిట్ట చెరువులో భారీ అభివృద్ధి ప్రణాళికలు
స్థానిక ఉపాధి కోసం పరిశ్రమల కారిడార్ ఏర్పాట్లు
ముఖ్యమంత్రి హెలికాప్టర్ సర్వేప్రత్యేక దృష్టి
అయోధ్య తర్వాత అంతటి ప్రాధాన్యం , ఒంటిమిట్టకు గుర్తింపు – బొబ్బిలి రాయుడు
ఒంటిమిట్ట అంటే గౌరవం’ – ఎంపీపీ ప్రతినిధిసలాబాద్ బుజ్జి
ఒంటిమిట్ట కోదండ రామయ్య కీర్తిని నలదిక్కుల వ్యాప్తి చేద్దాం- మండల ప్రధాన కార్యదర్శి ఆలూరి వెంకటసుబ్బయ్య
సమిష్టి కృషికి నేతల కృతజ్ఞతలు
“ఒంటిమిట్ట శ్రీ కోదండరాముల స్వామి వారి సీతారాముల కళ్యాణం ‘నా భూతో నా భవిష్యతి’ అనే విధంగా అత్యంత వైభవంగా జరిగింది” అని రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. ఒంటిమిట్టలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
లోక కళ్యాణార్థం అధికారికంగా కళ్యాణం
లోక కళ్యాణార్థం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీటీడీ సంయుక్తంగా ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. లక్షలాది భక్తులు హాజరైనప్పటికీ, టీటీడీ మరియు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సౌకర్యాలు కల్పించిందని ప్రశంసించారు.
స్టేట్ టెంపుల్‌గా మారిన ఒంటిమిట్ట – అభివృద్ధికి శ్రీకారం
2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంటిమిట్టను స్టేట్ టెంపుల్‌గా ప్రకటించడంతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయని గుర్తుచేశారు. ఆ నిర్ణయం ఒంటిమిట్టను రాష్ట్రవ్యాప్తంగా ఒక బ్రాండ్‌గా నిలబెట్టిందన్నారు.
శ్రీరామ ఎత్తిపోతల పథకం – కరువు నివారణకు దారి
ఒంటిమిట్టలో కరువు సమస్యను పరిష్కరించేందుకు శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. మూడు సంవత్సరాలపాటు 365 రోజులు సాగు, తాగునీరు అందేలా రూ.12 కోట్లతో మూడు నెలల్లో పథకాన్ని నవీకరించేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు.
వైసీపీ పాలనలో నిర్లక్ష్యం – ఇప్పుడు వేగవంతమైన అభివృద్ధి
మధ్యలో వైసీపీ ప్రభుత్వం ఒంటిమిట్ట అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం తిరిగి అభివృద్ధి పునరుద్ధరణతో పాటు కళ్యాణ మహోత్సవాన్ని గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్వహించామని తెలిపారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు – కాటేజీల నిర్మాణానికి టెండర్లు
భక్తుల సంఖ్య పెరగడంతో అదనపు వసతులు అవసరమయ్యాయని, టీటీడీ ప్రత్యేక కాటేజీల నిర్మాణానికి టెండర్లు పిలవనుందని వెల్లడించారు.
ఆధ్యాత్మిక – పర్యాటక హబ్‌గా ఒంటిమిట్ట
ఒంటిమిట్టను తిరుమలకు దీటుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా అనుసంధానం, ప్రత్యేక రహదారి నిర్మాణం ద్వారా నగర అభివృద్ధి మరింత వేగవంతం కానుందని చెప్పారు.
ఒంటిమిట్ట చెరువు – భారీ ప్రణాళికలు
ఒంటిమిట్ట చెరువులో రూ.20 కోట్లతో ఆగమ శాస్త్ర పండితుల సూచనల మేరకు విగ్రహ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు.
ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక కారిడార్
రాజంపేట నియోజకవర్గం నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు తగ్గించేందుకు స్థానికంగానే పరిశ్రమల కారిడార్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు. కొత్త మాధవరం టెక్స్టైల్స్‌తో పాటు ఇతర పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపడతామని వెల్లడించారు.
హెలికాప్టర్ సర్వే – సీఎం ప్రత్యేక దృష్టి
ఒంటిమిట్ట నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఇందుకోసం హెలికాప్టర్ ద్వారా ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు.
అయోధ్య తర్వాత అంతటి ప్రాధాన్యం – బొబ్బిలి రాయుడు
టీడీపీ సీనియర్ నాయకుడు బొబ్బిలి రాయుడు మాట్లాడుతూ, దేశంలో ప్రసిద్ధి చెందిన రామాలయాల్లో అయోధ్య తర్వాత ఒంటిమిట్టకే స్థానం ఉందన్నారు. ప్రాచీన దేవాలయాల్లో ఒకటిగా నిలిచిన ఈ క్షేత్రం అభివృద్ధితో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా మారిపోతుందని అభిప్రాయపడ్డారు.
‘ఒంటిమిట్ట అంటే గౌరవం’ – ఎంపీపీ ప్రతినిధి సాలాబాద్ బుజ్జి
ఎంపీపీ ప్రతినిధి సాలాబాద్ బుజ్జి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు సతీసమేతంగా కళ్యాణానికి హాజరై భారతీయ సంప్రదాయాలను యువతకు తెలియజేశారని కొనియాడారు. ఒంటిమిట్ట అంటే ఆధ్యాత్మికత, అభివృద్ధి, గౌరవం అనే భావన ఏర్పడిందన్నారు.
ఒంటిమిట్ట రామయ్య కీర్తిని నలు దిశల వ్యాప్తి చేద్దాం- తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆలూరు వెంకటసుబ్బయ్య
ఒంటిమిట్ట కోదండ రాముడు కళ్యాణం జగన్ మోహన్ రాజు కృషితో టిటిడి , జిల్లా అధికారుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని అన్నారు. ఒంటిమిట్ట కోదండరామయ్య కీర్తిని నలుదిక్కులా వ్యాప్తి చేద్దామని ఆయన అన్నారు.
సమిష్టి కృషికి కృతజ్ఞతలు
జగన్మోహన్ రాజు ప్రత్యేక కృషి, టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగం సహకారంతో బ్రహ్మోత్సవాలు కనివిని ఎరుగని రీతిలో నిర్వహించగలిగామని నేతలు తెలిపారు. కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ఒంటిమిట్టను ఆధ్యాత్మిక, పర్యాటక, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తోందని, త్వరలోనే ఈ ప్రాంతం తిరుమల సరసన నిలుస్తుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

2,802 Views

You may also like

Leave a Comment