Home ట్రెండింగ్ అమెరికా సీజ్ ఫైర్ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్.. నెక్ట్స్ ఏంటి..? | ఇరాన్ US కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది, అమెరికాకు 10-షరతుల ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించింది ఇరాన్ కాల్పుల విరమణ ప్రతిపాదన – VRM MEDIA

అమెరికా సీజ్ ఫైర్ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్.. నెక్ట్స్ ఏంటి..? | ఇరాన్ US కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది, అమెరికాకు 10-షరతుల ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించింది ఇరాన్ కాల్పుల విరమణ ప్రతిపాదన – VRM MEDIA

by VRM Media
0 comments
అమెరికా సీజ్ ఫైర్ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్.. నెక్ట్స్ ఏంటి..? | ఇరాన్ US కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది, అమెరికాకు 10-షరతుల ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించింది ఇరాన్ కాల్పుల విరమణ ప్రతిపాదన


అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ అమెరికాకు ఇరాన్ షాకుల మీద షాకులు ఇస్తోంది. తాజాగా అమెరికా ప్రతిపాదించిన సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించింది. చర్చల్లో భాగంగా ఇరాన్- అమెరికాకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్థాన్ ద్వారా తన సందేశాన్ని అందించారు. తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరాన్ సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. అయితే యుద్ధం శాశ్వతంగా ముగించాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ సంస్థ తాజాగా స్టేట్ న్యూస్ ఏజెన్సీ అయిన ఇస్లామిక్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.

ఈ మేరకు అమెరికాకు 10 నిబంధనలతో ఓ ఫ్రేమ్ వర్క్ ను ప్రతిపాదించింది. అమెరికా ప్రతిపాదించిన తాత్కాలిక కాల్పుల విరమణ కంటే ఎన్నో రెట్లు బెటర్ గా చూపుతోంది. ఈ ఫ్రేమ్ వర్క్‌లో భాగంగా ఇరాన్ మొదటికే యుద్దానికి ముగింపు పలకాలని చెబుతోంది. కేవలం సరిహద్దుల్లోనే కాకుండా లెబనాన్, గాజాలోనూ యుద్ధం ఆగిపోవాలని సూచిస్తోంది. సీజ్ ఫైర్ గ్యారంటీస్ ప్రకారం.. మరోసారి ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు జరగకుండా ప్రతిపాదిస్తోంది.

అలాగే హార్మూజ్ జలసంధి ద్వారా రాకపోకలు సాగించే నౌకలకు రక్షణ కల్పించే విధంగా ప్రోటోకాల్స్ ఉండాలని స్పష్టం చేసింది. ఇరాన్ పై ఉన్న ఆంక్షలను తొలగించాలని మరో యుద్ధం కారణంగా ధ్వంసం అయిన ప్రాంతాలకు పునర్నిర్మాణానికి తగిన నిబంధనలు ఉండాలని. దానితో పాటు తమ దేశంపై ఉన్న ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని.. NPT కింద యురేనియంను శుద్ధీకరణ తమ హక్కుగా గుర్తించాలని ఇరాన్ కోరుతోంది. ఈ యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి నష్ట పరిహారం కూడా ఇరాన్ కోరుతోంది.

ఇరాన్ US కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది ఇరాన్ కాల్పుల విరమణ ప్రతిపాదనకు 10-షరతుల ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించింది

ఇక ఇదే అంశంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా దగ్గర అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికిప్పుడు వెనక్కు తగ్గే ఆలోచన లేదని చెప్పారు. కానీ ఈ సమస్యను ఇక్కడితోనే ముగించాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని మరోసారి ట్రంప్ స్పష్టం చేశారు. మరి ఇరాన్ తాజా డిమాండ్లపై అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

2,801 Views

You may also like

Leave a Comment