Home ట్రెండింగ్ లీటర్ పెట్రోల్ రూ. 400.. పక్క దేశంలోకి వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటున్న ప్రజలు..! | చమురు సంక్షోభం కారణంగా హాంగ్‌కాంగ్ పెట్రోల్ ధర లీటరుకు ₹400కి చేరుకుంది; చైనా పెట్రోల్ ధరలో పౌరులు ఇంధనం నింపుతున్నారు – VRM MEDIA

లీటర్ పెట్రోల్ రూ. 400.. పక్క దేశంలోకి వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటున్న ప్రజలు..! | చమురు సంక్షోభం కారణంగా హాంగ్‌కాంగ్ పెట్రోల్ ధర లీటరుకు ₹400కి చేరుకుంది; చైనా పెట్రోల్ ధరలో పౌరులు ఇంధనం నింపుతున్నారు – VRM MEDIA

by VRM Media
0 comments
లీటర్ పెట్రోల్ రూ. 400.. పక్క దేశంలోకి వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటున్న ప్రజలు..! | చమురు సంక్షోభం కారణంగా హాంగ్‌కాంగ్ పెట్రోల్ ధర లీటరుకు ₹400కి చేరుకుంది; చైనా పెట్రోల్ ధరలో పౌరులు ఇంధనం నింపుతున్నారు


అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. 38 రోజులుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడులు జరుగుతున్నాయి. అంతే కసిగా ఇరాన్ జవాబిస్తోంది. ఓ వైపు సంధి చర్చలు చేపడుతూనే మరోవైపు భీకర దాడులను కొనసాగిస్తున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని కారణంగా ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో కూరుకుపోయాయి. దాదాపు అన్ని దేశాల్లో చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న సంపన్న దేశాలే ఈ పరిస్థితులను తట్టుకోలేక పోతున్నాయి.

ఇక పేద, మధ్యతరగతి దేశాల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. చమురు సంక్షోభం కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్తే జేబులు ఖాళీ అవుతున్నాయని వాపోతున్నారు. ఇప్పుడు హాంకాంగ్ పరిస్థితి ఇలాగే ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఇక్కడ పెట్రోల్ రేటు ఉంది. హాంకాంగ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 383 గా ఉంది. త్వరలోనే రూ. 400 కు చేరువలో ఉంది. దీంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ దేశంలో పెట్రోల్ ధర రూ.1300 లకు పైగానే ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం కావడం లేదు.

ఇక హాంకాంగ్‌లో సొంత వాహనాలు ఉన్నవారు మొత్తం జనాభాలో 8 శాతమే అయినా చమురు సంక్షోభం కారణంగా ఆ దేశంలో రవాణా, లాజిస్టిక్స్ విభాగాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రానున్న రోజుల్లో హాంకాంగ్ లో నిత్యావసర ధరలు పెరిగి ద్రవ్యోల్బణం రావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి హాంకాంగ్‌లో ఎప్పుడూ పెట్రోల్ రేట్లు అధికంగానే ఉంటాయి. కారణం.. అక్కడ అధిక పన్నులు, భూముల ధరలు పెరగడం.. అయితే ఈసారి ఇరాన్ యుద్ధంతో ఆ రేట్లు మరింతగా పెరిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చమురు సంక్షోభం కారణంగా హాంకాంగ్ పెట్రోల్ ధర లీటరుకు 400కి చేరుకుంది, చైనాలో పెట్రోల్ ధర పౌరులు ఇంధనం

అయితే హాంకాంగ్ లో అధిక పెట్రోల్ ధరల కారణంగా అక్కడి ప్రజలు విడిచి వెళ్లిపోతున్నారు. సరిహద్దు దేశం అయిన చైనాకు వెళ్లి పెట్రోల్ పోయించుకుంటున్నారు. హాంకాంగ్ తో పోల్చితే చైనా పెట్రోల్ ధర మూడో వంతు తక్కువగా ఉంది. అయితే హాంకాంగ్‌కు అవసరమైన చమురులో దాదాపు 80 శాతం చైనా నుంచే సరఫరా అవుతుంది. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చమురు సరఫరా కొనసాగుతోందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

2,801 Views

You may also like

Leave a Comment