Home ట్రెండింగ్ రానున్న 12 గంటల రైలులో ప్రయాణం చేయకండి: ప్రజ‌ల‌కు కీల‌క హెచ్చ‌రిక‌లు | ఇరాన్‌కు ఇజ్రాయెల్ హెచ్చరికలు రైళ్లను ఉపయోగించవద్దు లేదా రైల్వే ట్రాక్‌లను చేరుకోవద్దని ఇరాన్‌కు ఇజ్రాయెల్ హెచ్చరించింది – VRM MEDIA

రానున్న 12 గంటల రైలులో ప్రయాణం చేయకండి: ప్రజ‌ల‌కు కీల‌క హెచ్చ‌రిక‌లు | ఇరాన్‌కు ఇజ్రాయెల్ హెచ్చరికలు రైళ్లను ఉపయోగించవద్దు లేదా రైల్వే ట్రాక్‌లను చేరుకోవద్దని ఇరాన్‌కు ఇజ్రాయెల్ హెచ్చరించింది – VRM MEDIA

by VRM Media
0 comments
రానున్న 12 గంటల రైలులో ప్రయాణం చేయకండి: ప్రజ‌ల‌కు కీల‌క హెచ్చ‌రిక‌లు | ఇరాన్‌కు ఇజ్రాయెల్ హెచ్చరికలు రైళ్లను ఉపయోగించవద్దు లేదా రైల్వే ట్రాక్‌లను చేరుకోవద్దని ఇరాన్‌కు ఇజ్రాయెల్ హెచ్చరించింది


అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరాన్ కు ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తామని ట్రంప్ తాజాగా హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ మాటలను ఇరాన్ ఏమాత్రం లెక్కచేయడం లేదు. దాడులను కొనసాగిస్తూనే ఉంది.

ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై దాడులను చేస్తుండగా.. అంతే రేంజ్ లో ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు సమీపంలోని అల్బోర్జ్ ప్రావిన్స్ ను లక్ష్యంగా చేసుకుని జరిపిన వైమానిక దాడిలో 18 మంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ దాడిలో మరో 24 మంది గాయపడినట్లు సమాచారం. అయితే ట్రంప్ డెడ్ లైన్ దగ్గర పడుతున్న ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది.

ఇరాన్ ప్రజలు ఎవరూ రైళ్లను ఉపయోగించకూడదని కూడా ఇతర రైల్వే లైన్ల సమీపానికి ఎవరూ వెళ్లొద్దని ఇజ్రాయెల్ సైన్యం కీలక ప్రకటన చేసింది. ఇరాన్ లోని ప్రజల భద్రత దృష్ట్యా ప్రయాణాలకు రైళ్లను ఉపయోగించకూడదని కోరింది. ఈ మేరకు ఇరాన్ ప్రజల రైలు ప్రయాణాలను తక్షణం మానుకోవాలని సూచనలు చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ .. పర్షియన్ భాషలో ఎక్స్ వేదికగా పోస్టు పెట్టినట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ స్పష్టం చేసింది.

ఇరాన్‌కు ఇజ్రాయెల్ గట్టి సలహా జారీ చేసింది రైళ్లు లేదా రైల్వే ట్రాక్‌లను చేరుకోవద్దని ఇరాన్‌కు ఇజ్రాయెల్ హెచ్చరిక

ఇక అధ్యక్షుడు ట్రంప్ విధించిన డెడ్ లైన్ గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇరాన్ కు కీలకంగా మారింది. ఇరాన్‌ను ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేస్తామంటూ ట్రంప్ తాజాగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హెచ్చరించారు. ఆ రాత్రి మంగ‌ళ వారం రాత్రే కావొచ్చంటూ తీవ్రంగా హెచ్చ‌రించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌ పై అమెరికా-ఇజ్రాయెల్ సైన్యం సంయుక్తంగా మరోసారి భీక‌ర దాడులకు సిద్ధ‌మైన‌ట్లుగా సమాచారం.

2,804 Views

You may also like

Leave a Comment