Home ట్రెండింగ్ పెళ్లైన 11 నెలలకే ఘోరం: బావను బలి తీసుకున్న బామ్మర్ది.. కారణం తెలిసి షాక్! | శ్రీ సత్యసాయి జిల్లాలో కుటుంబ సమస్యల కారణంగా సోదరి భర్తను హత్య చేసిన బావపై నేర వార్తలు – VRM MEDIA

పెళ్లైన 11 నెలలకే ఘోరం: బావను బలి తీసుకున్న బామ్మర్ది.. కారణం తెలిసి షాక్! | శ్రీ సత్యసాయి జిల్లాలో కుటుంబ సమస్యల కారణంగా సోదరి భర్తను హత్య చేసిన బావపై నేర వార్తలు – VRM MEDIA

by VRM Media
0 comments
పెళ్లైన 11 నెలలకే ఘోరం: బావను బలి తీసుకున్న బామ్మర్ది.. కారణం తెలిసి షాక్! | శ్రీ సత్యసాయి జిల్లాలో కుటుంబ సమస్యల కారణంగా సోదరి భర్తను హత్య చేసిన బావపై నేర వార్తలు


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-కొరివి జయకుమార్

చెల్లెలి సంతోషం కోసం ఏదైనా చేసే అన్నలు ఎంతో మంది ఉంటారు. కానీ ఆమె బాధను భరించలేక తన పసుపు కుంకాలను దూరం చేశాడు ఓ అన్న. అలాంటి హృదయ విదారక ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. చెల్లెలిని వేధిస్తున్నాడనే కోపంతో, సొంత బావనే హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

అసలేం జరిగిందంటే..

లేపాక్షి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రాజు చెల్లెలు మేఘనకు సుమారు ఏడాది క్రితం బెంగళూరులోని శివారులోని ఎలహంక ఏర్పాటు చేసిన వినయ్ కుమార్‌తో వివాహం జరిగింది. వినయ్ తన అన్నతో కలిసి చిన్న ప్రైవేట్ సంస్థను నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. మేఘన కూడా అదే సంస్థలో పనిచేస్తూ, మొదట్లో దాంపత్య జీవితం సవ్యంగా సాగింది. కానీ కొద్ది కాలానికే వారి మధ్య విభేదాలు వచ్చాయి.

శ్రీ-సత్యసాయి-జిల్లాలో-కుటుంబ సమస్యల కారణంగా-సోదరి-భర్తను-చంపిన-కోడలు-గురించి-క్రైమ్-న్యూస్

వినయ్ కుమార్ తన భార్యపై అనుమానం పెంచుకుని, తరచూ ఆమెను వేధించడం ప్రారంభించాడు. చిన్న విషయాలకే గొడవలు పెట్టడం, ఆమె ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేయడం, ఇంకా ఆమె అన్న రాజుకు ఫోన్ చేసి అవమానించడం రోజువారీగా మారింది. ఈ పరిణామాలు రాజులో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. చెల్లెలి బాధను తట్టుకోలేక, చివరకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనకు దిగాడు.

అదే ఆవేశంలో రాజు పక్కా ప్రణాళిక రూపొందించి, వినయ్‌ను స్వగ్రామానికి పిలిపించాడు. గ్రామ సమీపంలోని హంద్రీ నీవా కాలువ వద్దకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికి తెలియకుండా మృతదేహాన్ని, అతని బైక్‌తో పాటు కాలువలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే కొద్ది రోజుల తర్వాత కాలువలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఇదే సమయంలో వినయ్ కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో, కాలువలో లభించిన మృతదేహం వినయ్‌దేనని నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు కాల్ డేటాను పరిశీలించారు, చివరిసారిగా రాజే వినయ్‌ను సంప్రదించినట్లు బయటపడింది. దీంతో రాజును అదుపులోకి తీసుకుని విచారించగా, తన వేధింపుల కారణంగా కోపంతోనే ఈ హత్య చేశానని ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

2,801 Views

You may also like

Leave a Comment