Home Uncategorized పోలీసుల లపై దుష్ర్పచారం…తగునా..!

పోలీసుల లపై దుష్ర్పచారం…తగునా..!

by VRM Media
0 comments

ఒంటిమిట్ట VRM న్యూస్ బాలమౌళి
ఏప్రిల్ 8

ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతాయి.
ఉత్సవాలలో ముఖ్యమంత్రికి సెక్యురిటి కల్పించడానికి..ప్రజల రక్షణ కోసం వందలాదిమంది పోలీసులు విధులు నిర్వహిస్తారు.
ఉత్సవాల సమయంలో పోలీసులకు భోజనాల ఏర్పాటు కోసం కొంతమంది రాజకీయ నాయకులు, దాతలు భోజనం సౌకర్యార్థం తమ వంతు సాయంగా వారి సహాయ సహకారాలు అందిస్తారు.
ఇలా ప్రతి సంవత్సరం దాతలు ఏదో ఒక రూపంలో పోలీసుల వసతులు కోసం తమ వంతు సహాయం అందించడం ఆనవాయితీగా వస్తుంది.
ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కొంతమంది రాజకీయ నాయకులు పోలీసులకు భోజనాలు ఏర్పాట్ల కోసం తమ వంతు సహకారం అందించారు. ఎన్నడూ లేనివిధంగా ఈసారి పోలీసులు అన్నదానం కోసం రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు వసూలు చేశారని దుష్ప ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
ఇలాంటి ప్రచారం చేయడం ఎంత వరకు కరెక్ట్
అనేది వారి విజ్ఞతకే వదిలేయాలి..
బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు రక్షణ కల్పించిన పోలీసులు సేవలను ప్రశంసించకుండా ఇలాంటి దుష్ప్రచారం చేయడం మంచిది కాదని భక్తులు మండిపడుతున్నారు.
పోలీసులపై దుష్ప్రచారం సరికాదు.

2,808 Views

You may also like

Leave a Comment