Home ఎంటర్‌టెయిన్మెంట్ ట్రెండింగ్ లోకి డైరెక్టర్ మెహర్ రమేష్.. మహేష్, అల్లు అర్జున్ తర్వాత ఎవరు? – VRM MEDIA

ట్రెండింగ్ లోకి డైరెక్టర్ మెహర్ రమేష్.. మహేష్, అల్లు అర్జున్ తర్వాత ఎవరు? – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


ప్రస్తుతం చేతిలో సినిమాలే లేని టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్(మెహర్ రమేష్) అనూహ్యంగా ట్రెండింగ్ లోకి వచ్చారు. స్టైలిష్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్‌కు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ.. ప్రజెంట్ టాలీవుడ్‌లో రూపొందించబడిన కొన్ని భారీ బడ్జెట్ సినిమాల టైటిల్స్ కి, క్యారెక్టర్ పేర్లకు మెహర్ రమేష్ ఇన్స్పిరేషన్ గా మారారంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘శక్తి’. 2011లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. రిజల్ట్ పక్కన పెడితే, ఇప్పుడు టాలీవుడ్‌లో రాబోతున్న రెండు భారీ సినిమాలకు ఈ ‘శక్తి’ సినిమానే ఇన్‌స్పిరేషన్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

మహేష్ బాబు ‘రుద్ర’.. అల్లు అర్జున్ ‘రాక’!
‘శక్తి’ సినిమాలో ఎన్టీఆర్ నటించిన ఒక పాత్ర పేరు ‘రుద్ర’. అలాగే ఆ సినిమాలో మెయిన్ విలన్ పేరు ‘రాకా’. ఇప్పుడు ఆ రెండు పేర్లు ట్రెండ్ అవుతున్నాయి.

మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందించిన భారీ బడ్జెట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి'(వారణాసి). ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు ‘రుద్ర'(రుద్ర).

ఇక కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా ‘రాకా'(రాకా) అనే టైటిల్‌ను తాజాగా అనౌన్స్ చేశారు. ‘రాక’ అంటే రాక్షసుడు అనే అర్థం వస్తుంది.

ఇలా మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ‘శక్తి’ సినిమాలో హీరో పేరు ‘వారణాసి’లో హీరో పేరు అయింది. అలాగే శక్తిలోని విలన్ పేరు అల్లు అర్జున్ సినిమా టైటిల్ గా మారింది.

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
ఈ కో-ఇన్సిడెన్స్‌పై మీమ్స్ రాయులు రెచ్చిపోతున్నారు. “మెహర్ రమేష్ థాట్స్ అప్పట్లోనే చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయి” అని కొందరు అంటుంటే, “రాజమౌళి, అట్లీ వంటి స్టార్ డైరెక్టర్‌లకు కూడా మెహర్ రమేష్ క్యారెక్టర్ పేర్లే దిక్కయ్యాయి” అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి ప్లాపుల్లో ఉన్న మెహర్ రమేష్, ఇలా తన పాత సినిమా క్యారెక్టర్ల పేర్ల ద్వారా మళ్లీ వార్తల్లో నిలవడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే, ‘శక్తి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా, అందులోని పేర్లు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్‌లుగా మారుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఇతను హీరో ఏంటి అన్నారు.. ఇప్పుడు పాన్ ఇండియాని షేక్ చేసాడు!

2,801 Views

You may also like

Leave a Comment