[ad_1]
భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
భారతీయులకు బంగారం అంటే ఓ ఎమోషన్.. పెళ్లి అయినా మరే ఫంక్షన్ అయినా ఒంటి నిండా నగలతో వెళ్లాలని చాలామంది మహిళలు కలలు కంటూ ఉంటారు. కానీ దేశంలో బంగారం ధరలు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో తులం బంగారం ధర రూ. 1,53,000 పైమాటే. దాంతో ఈ రోజుల్లో బంగారం కొనాలంటే వామ్మో అని బెంబేలెత్తిపోయే పరిస్థితి. ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో బంగారం కొనకుండా ఉండలేని పరిస్థితి. ఇక చేసేదేంలేక లక్షల ఖర్చు చేసి మరీ బంగారం కొనేస్తున్నారు భారతీయులు.
అయితే ఓ దేశంలో బంగారం ధరలు చూస్తే మీరు షాక్ అవుతారు. అక్కడ 24 క్యారెట్ల స్వచ్చమైన గ్రాము బంగారం ధర రూ. 181-200 మధ్యలోనే ఉంటుంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర అంటే తులం బంగారం ధర కేవలం రూ. 2,000.. అవును వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. అక్కడ పాలు, బ్రెడ్ కంటే చవకగా బంగారం లభ్యం అవుతుంది. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా అక్కడ ఈ పరిస్థితి తలెత్తింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బంగారం, చమురు ధరలకు మించి అక్కడ నిత్యావసరాల ధరలు ఉన్నాయి.
వెనిజులా.. ప్రపంచంలోనే అత్యధిక చమురు, బంగారం నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటిగా ఉంది. అయితే పలు కారణాల వల్ల ప్రస్తుతం ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. అక్కడ బంగారం, చమురు ధరల కంటే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వెనిజులలో ద్రవ్యోల్బణం పెరగడంతో స్థానిక బొలివర్ కరెన్సీ విలువ పాతాళానికి పడిపోయింది. దాంతో వెనిజులలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర కంటే పాలు, డజను గుడ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక మైనింగ్ ప్రాంతాల్లోని ప్రజలు తమ వద్ద ఉన్న చిన్న చిన్న బంగారం ముక్కలను పాలు, గుడ్లు, బియ్యం లాంటి నిత్యావసర సరుకులను కొనుగోలు చేస్తున్నారు. అయితే అపారమైన చమురు, బంగారం నిల్వలు సంపన్న దేశంగా ఉన్న వెనిజులకు ఈ పరిస్థితి రావడానికి కారణం.. అక్కడి ప్రభుత్వాల తప్పిదమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వం.. చేసిన అప్పులను తీర్చేందుకు భారీగా బంగారం నిల్వలను విదేశాలకు తరలించింది. అలాగే ప్రభుత్వ అసమర్థత, అవినీతి పాలన కారణంగా వెనిజుల ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird