Home ట్రెండింగ్ ఆ నిధులన్నీ వారికే: సీఎం రేవంత్ నిర్ణయం | revanthreddy కార్పొరేట్‌లకు చెబుతాడు: CSR ని భాగస్వామ్యంగా పరిగణించండి, భవిష్యత్తు తరాలకు CSR ఖర్చు మాత్రమే కాదు – VRM MEDIA

ఆ నిధులన్నీ వారికే: సీఎం రేవంత్ నిర్ణయం | revanthreddy కార్పొరేట్‌లకు చెబుతాడు: CSR ని భాగస్వామ్యంగా పరిగణించండి, భవిష్యత్తు తరాలకు CSR ఖర్చు మాత్రమే కాదు – VRM MEDIA

by VRM Media
0 comments
ఆ నిధులన్నీ వారికే: సీఎం రేవంత్ నిర్ణయం | revanthreddy కార్పొరేట్‌లకు చెబుతాడు: CSR ని భాగస్వామ్యంగా పరిగణించండి, భవిష్యత్తు తరాలకు CSR ఖర్చు మాత్రమే కాదు


తెలంగాణ

ఓయ్-బొమ్మ శివకుమార్

స‌మాజాభివృద్ధికి చేసేది ఖ‌ర్చుగా కాకుండా భాగ‌స్వామ్యంగా చూడాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్‌ఎస్‌ఆర్ నిధులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బుధవారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీలు సీఎస్ఆర్‌కు చేస్తున్న వ్య‌యం వంద‌కు వంద శాతం స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌ల‌ని అన్నారు.

త‌మ ప్ర‌భుత్వం విద్యా, వైద్యం, జ‌ల వ‌న‌రుల సంర‌క్ష‌ణ‌కు ప్రాధాన్యం ఇస్తుంద‌ని తెలియ‌జేశారు. కంపెనీలు వీటితో పాటు త‌మ‌కు ఇష్ట‌మైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్ఆర్ నిధులు వినియోగించాల‌ని సూచించింది. ప్రభుత్వంతో పాటు కంపెనీలు కాలి చేసే వ్య‌యంతో తెలంగాణ విద్యార్థుల‌ను ప్ర‌పంచ స్థాయి నైపుణ్యం ఉన్న వారిగా తీర్చిదిద్ది భ‌విష్య‌త్ అవ‌కాశాలను వారు అందిపుచ్చుకునేలా త‌యారు చేయ‌గ‌మ‌ని సీఎం అన్నారు.

విద్య‌పై పెట్టే వ్య‌యాన్ని తాము భ‌విష్య‌త్ త‌రాల‌పై పెట్టే పెట్టుబ‌డిగా కోరుకుంటున్నామ‌ని సీఎం అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్యలో హైదరాబాద్ నగరంలోనే 44 శాతం మంది ఉన్నారు.. వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వ‌స‌తుల‌ను వినియోగించుకుంటున్నందున త‌మ సీఎస్ఆర్ నిధుల‌లో ఎక్కువ భాగం అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాల‌న్నారు.

ఎస్‌ఎస్‌ఆర్ నిధుల వినియోగంలో ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన విధానం లేనందున తాము ఒక ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఇందుకు నియ‌మించామ‌ని సీఎం అన్నారు. కంపెనీల ప్రతినిధులు ఆయనతో స‌మ‌న్వ‌యం చేసుకొని త‌మ‌కు ఆస‌క్తి ఉన్న విద్యా, వైద్యం, జ‌ల వ‌న‌రులు, నైపుణ్య శిక్ష‌ణ‌, వార‌స‌త్వ క‌ట్ట‌డాల ప‌రిర‌క్ష‌ణ‌, అడ‌వుల సంర‌క్ష‌ణ‌ఇలా దేనికి సీఎస్‌ఆర్ నిధులు వినియోగించుకోవాలని కోరారు.

కార్పోరేట్‌లు CSRని పార్ట్‌నర్‌షిప్‌గా మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు CSRగా పరిగణించాలని రేవంత్ రెడ్డి చెప్పారు

ఇప్ప‌టికే ర‌హేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ రూ.50 కోట్లు, య‌శోద ఫౌండేష‌న్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వ‌చ్చాయ‌ని.. వారికి అభినంద‌న‌లు తెలిపారు. కంపెనీల ప్ర‌తిధులు తెలియ‌లేద‌ని సీఆర్‌ఆర్ నిధుల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా ఎవ‌రూ త‌మ‌ను సంప్ర‌దించ‌ని తెలిపారు. ఈ విష‌యంలో చొరవ తీసుకున్నందుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు. పాఠశాల విద్యా, ఆసుపత్రులు, వార‌స‌త్వ క‌ట్ట‌డాల ప‌రిర‌క్ష‌ణ‌కు వారు ఆస‌క్తి చూపారు.

2,802 Views

You may also like

Leave a Comment