[ad_1]
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించిన అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోక్ సభ ఆమోదించిన సమయంలో మావిగన్ ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు (మావిగన్) ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించారు.
అదే సమయంలో జగన్ పాదయాత్ర అంశం కూడా తెరమీదికి వస్తోంది. 2027లో ఆయన పాదయాత్ర చేపట్టే అవకాశం ఉంది. పాదయాత్ర సందర్భంగా మావిగన్ ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తారనే అంచనాలు. తాజాగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైయస్ఆర్సీపీ స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో సైతం ఈ అంశం చర్చకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ పరిణామాల మధ్య జగన్.. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను గుర్తు చేసుకున్నారు. 2003లో సరిగ్గా ఇదే ఏప్రిల్ 9వ తేదీన ఆయన ఉమ్మడి ఏపీలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తన పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. 1,475 సంవత్సరాల పాటు మండుటెండల్లో నడిచారు వైఎస్ఆర్. అది- రాష్ట్ర రాజకీయాలకు తీవ్రంగా ప్రభావితం చేసింది. అధికారం కోరుకోవాలనుకునే ఏ పార్టీ అయినా సరే పాదయాత్ర మీదే ఆధారపడేలా చేసింది.
నాటి పాదయాత్రను జగన్ గుర్తు చేసుకున్నారు. ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగ రాయగలదని నిరూపించిందని పేర్కొన్నారు. 2023, ఏప్రిల్ 9న ఎర్రటి ఎండలో ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేపట్టిన ఆ పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది, నేనున్నాననే భరోసా ఇచ్చిందని. వైఎస్ఆర్ కు రాష్ట్రం మొత్తం మద్ద తుగా నిలిచి ముఖ్య మంత్రిని చేసిందని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేసిన దగ్గ్రి నుంచి ఆయన తీసుకు వచ్చిన ఎన్నో సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపు రేఖలు మార్చేశాయని పేర్కొన్నారు. రైతును రాజుగా నిలిపారని, అక్కచెల్లెమ్మలు వారి సొంత కాళ్లపై నిలబడ్డేలా చేశాయని, బడుగు, బలహీన వర్గాలకు బతుకుపై భరోసా కల్పించాలని అన్నారు. ఎంతో మంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, కలెక్టర్లుగా అయ్యేలా చేసిందని చెప్పారు.
వైఎస్ఆర్ ఈ ఒక్క పాదయాత్రతో ఎన్నో సాగునీటి, ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని, ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించని జగన్ చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న వేసిన ఆ ముద్రను ఎవరూ చెరిపేయలేనిదిగా అభివర్ణించారు. వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర నేటికి 23 ఏళ్లు అయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ తన ఈ ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird