Home ట్రెండింగ్ కథ మళ్లీ మొదటికి- పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదా? | అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు పదునైన క్రాష్ రిటైల్ ఇంధన ధర భారతదేశం స్థిరంగా ఉన్న తర్వాత మళ్లీ పెరుగుతున్నాయి – VRM MEDIA

కథ మళ్లీ మొదటికి- పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదా? | అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు పదునైన క్రాష్ రిటైల్ ఇంధన ధర భారతదేశం స్థిరంగా ఉన్న తర్వాత మళ్లీ పెరుగుతున్నాయి – VRM MEDIA

by VRM Media
0 comments
కథ మళ్లీ మొదటికి- పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదా? | అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు పదునైన క్రాష్ రిటైల్ ఇంధన ధర భారతదేశం స్థిరంగా ఉన్న తర్వాత మళ్లీ పెరుగుతున్నాయి


వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మళ్లీ పెరిగాయి. రికార్డు స్థాయిలో పతనమైన మరుసటి రోజే క్రూడ్ రేట్లు భారీగా పెరిగాయి. దాదాపు తొమ్మిది శాతం మేర పెరుగుదల కనిపించింది. 2020 అత్యంత భారీ ఇంట్రాడే పతనాన్ని చవిచూసిన తర్వాత ముడిచమురు ధరలు ఆ వెంటనే తిరిగి పుంజుకోవడం విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలోని భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా చమురు సరఫరాకు అంతరాయం కలగవచ్చనే భయాలు ఈ ధరల కదలికలకు ప్రధాన కారణాలు.

అయినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ ముడిచమురు మార్కెట్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయి, భారతీయ చమురు కంపెనీ సామాన్య వినియోగదారులపై అదనపు భారాన్ని మోపట్లేదు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు సహా ఇతర నగరాల్లో నేటి ఇంధన ధరల్లో ఎటువంటి మార్పు లేదు. సాధారణ పెట్రోల్ ధరలు స్థిరంగా, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇదివరకే పారిశ్రామిక డీజిల్ ధరను 25 శాతం మేర పెంచాయి.

అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు పదునైన క్రాష్ రిటైల్ ఇంధన ధర భారతదేశం స్థిరంగా ఉన్న తర్వాత మళ్లీ పెరుగుతున్నాయి

దీంతో బల్క్ కొనుగోలుదారులకు ఇప్పుడు లీటరు రూ. 137.81 చెల్లించాల్సి వస్తోంది. ఇది ముందు ధర కంటే రూ. 28.22 అధికం. అయిదు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ఇంధన ధరలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది. చమురు కంపెనీలు రిఫైనరీల నుండి పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లను తక్కువ ధరలకు కొనుగోలు చేయడానికి నిర్ణయించాయి. ఈ చర్య చమురు మార్కెటింగ్ కంపెనీల నష్టాలను తగ్గించడం, వినియోగదారుల ధరలను స్థిరంగా ఉంచడం.

నేడు వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలు ఉన్నాయి.

హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46

ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77

కోల్కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41

ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54

చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06

భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94

డీజిల్ ధరలు ఇవీ..

హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,

ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67

కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02

ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03

చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61

భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52

2,801 Views

You may also like

Leave a Comment