

-వారణాసి కోసం ఎదురుచూపులు
-కథపై అందరిలో ఆసక్తి
-కానీ కథని తన వెబ్ సైట్ లో ఉంచిన సంస్థ
-అసలు ఆ న్యూస్ నిజమేనా!
వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అంటే సామెత కాస్త ఇప్పుడు వింటే వారణాసి(వారణాసి)అప్ డేట్స్ వినాలి, వారణాసి ఎలా ఉండబోతోందనే కలలు కనాలి అనే విధంగా మారింది. ఆ కోవలోనే వారణాసి కథపై కలలు కనే వాళ్ళు ఎంతో మంది. మరి ఆ కలల స్థాయిని పెంచేలా వారణాసి కథ ఇదే అంటూ ఒక న్యూస్ జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీతో తిరుగుతుంది. అంత సెక్యూరిటీ అని ఎందుకంటున్నానంటే వారణాసికి పని చేసిన విఎఫ్ ఎక్స్ సంస్థ తమ వెబ్ సైట్ లో కథని ఉంచిందని టాక్. మీరు ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ కథని చూసేద్దాం.
శివ భక్తుడైన రుద్ర(మహేష్ బాబు) కాలాన్ని సైతం అధిగమించే ఒక ప్రమాదకర యాత్రకి బయలు దేరతాడు. అతని లక్ష్యం అపారమైన శక్తి కలిగి ప్రస్తుతం కనిపించకుండా పోయినా ఒక విశ్వ కళాఖండంతో పాటు ఒక ఆభరణం. ఈ శతాబ్దాలుగా మరుగున పడిపోయిన ప్రాచీన రహస్యాలు ఒక దానితో ఒకటి రుద్రకి ఎదురవుతాయి.అసలు తను ఆ విధంగా చేయడానికి కారణం కుంభ(పృథ్వీ రాజ్ సుకుమారన్) అని, ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవడమే అతని లక్ష్యం అని కూడా తెలుసుకుంటాడు. మరి ఆ తర్వాత రుద్ర ఏం చేసాడు అనేదే కథ అని విఎఫ్ ఎక్స్ సంస్థ తమ వెబ్ సైట్ లో రాసుకొచ్చిందనేది టాక్.
ఇది కూడా చదవండి: ధురంధర్ 2: ధురంధర్ 2పై మరో తాజా కేసు..సాంగ్ మాదే అంటూ కోర్టుకి
వారణాసి అయితే ప్రస్తుతం రెగ్యులర్ షూట్ లో ఉంది. రాజమౌళి(Ss Rajamouli)మాత్రం మూవీకి సంబంధించిన ప్రతి నిర్ణయం తాను ఎప్పుడైతే చెప్పడల్చుకుంటాడో అప్పుడే చెప్తాడు. అప్పటి వరకు చిన్న క్లిప్ కూడా బయటకి రాదు. పైగా యూనిట్ సభ్యుల నుంచి టోటల్ టీం మెంబర్స్ కి వారణాసి గురించి ఎక్కడా మాట్లాడకూడదనే కండిషన్స్ ఉంటాయి. అలాంటిది వారణాసికి పని చేస్తున్న విఎఫ్ఎక్స్ సంస్థ వెబ్ సైట్ లో స్టోరీని ఉంచే సాహసం చేస్తుందా! అసలు ఆ ఆలోచన కూడా రానివ్వదు. కాబట్టి అది రాంగ్ న్యూస్. వారణాసికి మాత్రం రాజమౌళి రెగ్యులర్ విఎఫ్ ఎక్స్ కంపెనీ ‘మకుటా’ కాకుండా సినీ సైట్, ట్రిక్స్ టర్,మాడ్ అసెంబ్లజ్ ఎంటర్ టైన్ మెంట్ అనే మూడు బడా సంస్థలు పని చేస్తున్నాయి. ఈ మూడు హాలీవుడ్ కి చెందిన ఎన్నో హిట్ సినిమాలకి విఎఫ్ఎక్స్ అందించాయి. వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రానుండగా మహేష్(మహేష్ బాబు)గ్లోబ్ ట్రోటర్ గా రాముడిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే.