
భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ అక్కడి పరిస్థితి యుద్ధ వాతావరణాన్నే తలపిస్తోంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ హర్మూజ్ జలసంధిని మరోసారి మూసేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు మరోసారి భారీ షాక్ తగిలింది. హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసి వేసిన నేపథ్యంలో అక్కడి వరకూ తిరిగి నౌకలను బలవంతంగా వెనక్కు మరలిస్తున్నట్లు వెళ్లి అంతర్జాతీయ కథనాల ద్వారా వెల్లడి అవుతుంది.
అయితే సంక్షోభం నుంచి బయట పడేందుకు ఆసియాలోని అనేక దేశాలు వివిధ రూల్స్ ను పెట్టుకుని అమలు చేస్తున్నాయి. పాకిస్థాన్ లో ఇప్పటికే ఎనర్జీ లాక్ డౌన్ నడుస్తోంది. అక్కడి మార్కెట్లు, షాపింగ్ మాల్స్ రాత్రి 8 గంటల కల్లా క్లోజ్ చేస్తున్నారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, పాఠశాలలకు సెలువులు ఇచ్చారు.
ఇక శ్రీలంకలో పరిస్థితి మరోవిధంగా ఉంది. ఇంధన సంక్షోభంలో శ్రీలంకలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంధనం, విద్యుత్ ను ఆదా చేసేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి బుధవారం సెలవు విడుదల జారీ చేసింది. అలాగే ప్రజలు వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచనలు చేసింది. అదనంగా ప్రైవేట్ వాహనాలకు ఇంధనాన్ని రేషనింగ్ చేస్తోంది.
అలాగే మరో దేశం ఫిలిప్పీన్స్ ను కూడా పశ్చిమాసియా యుద్ధం తాకింది. ఫిలిప్పీన్ దేశం దాదాపు 98 శాతం దిగుమతులపైనే ఆధార పడుతుంది. దాంతో దేశంలో ప్రస్తుతం ఎనర్జీ ఎమర్జెన్సీ విధించారు. దేశంలోని విద్యుత్ ఉత్పత్తికి అవసరం అయిన గ్యాస్‌లు పూర్తి కావడంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇక వియత్నాం కూడా తమ దేశ పౌరులపై పలు ఆంక్షలు విధించింది. ఈ దేశంలో పెట్రోల్ ధరలు 60 పెరిగాయి. దాంతో అనవసర ప్రయాణాలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. కంపెనీలు తమ కు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు సూచనలు చేసింది.

ఇక మయన్మార్ లో కూడా ప్రజల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మయన్మార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆడ్ ఈవెన్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ రోజుల్లో ఈ విధానం వల్ల వాహనాలు రోడ్లపైకి రావాల్సి ఉంటుంది. అలాగే భారత్ కు సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ లోనూ ఆంక్షలు భారీగా విధించారు. అక్కడ విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తూ లోడ్ షెడ్డింగ్ అమలు సాధ్యం సమాచారం. ఈ దేశాలతోపాటు జర్మనీ, దక్షిణాఫ్రికా కూడా ఇదే విధానంలోకి జారుకునే అవకాశం ఉంది. ఇక భారత్ లో పరిస్థితి అదుపులోనే ఉంది.