Home ట్రెండింగ్ లీటర్ పెట్రోల్ కేవలం 3 రూపాయలకే.. మీకు కావాలా ?? | ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధర భారతీయ కరెన్సీ ప్రకారం ఇరాన్‌లో 3 రూపాయల కంటే తక్కువ ధర – VRM MEDIA

లీటర్ పెట్రోల్ కేవలం 3 రూపాయలకే.. మీకు కావాలా ?? | ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధర భారతీయ కరెన్సీ ప్రకారం ఇరాన్‌లో 3 రూపాయల కంటే తక్కువ ధర – VRM MEDIA

by VRM Media
0 comments
లీటర్ పెట్రోల్ కేవలం 3 రూపాయలకే.. మీకు కావాలా ?? | ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధర భారతీయ కరెన్సీ ప్రకారం ఇరాన్‌లో 3 రూపాయల కంటే తక్కువ ధర


అంతర్జాతీయ

-కొరివి జయకుమార్

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో.. పెట్రోల్-డీజిల్ ధరలు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయాలు గ్లోబల్ ఇంధన మార్కెట్‌ను అస్థిరంగా మార్చాయి. దీని ప్రభావం అనేక దేశాల్లో ఇంధన ధరలు, జీవన వ్యయం పెరిగింది.

ముడి చమురు ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు కాకుండా ఉత్పత్తి వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. దీని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతోంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది. ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం కూడా పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెట్రోల్ ? అత్యల్ప ధర ఉన్న పెట్రోల్ ఏ దేశాల్లో లభిస్తుందో తెలుసుకుందాం..

పెట్రోలు ధర ప్రపంచవ్యాప్తంగా-ఇరాన్‌లో అత్యల్ప ధర-భారత కరెన్సీ ప్రకారం-3 రూపాయల కంటే తక్కువ

అత్యంత ఖరీదైన పెట్రోల్ ఉన్న దేశాలు..

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెట్రోల్ ధరలు హాంగ్ కాంగ్‌లో నమోదవుతున్నాయి. లీటరు ధర $4.10 (సుమారు ₹340) ఉండగా.. 80% పెట్రోల్ దిగుమతులు, భారీ పన్నుల కారణంగా ఇంత ధర పలుకుతుంది.

ఇతర ఖరీదైన దేశాలు:

మలావి – $2.85

నెదర్లాండ్స్ – $2.73

డెన్మార్క్ – $2.66

సింగపూర్ – $2.54

జర్మనీ – $2.42

ఇంకా నార్వే, గ్రీస్ వంటి దేశాల్లో కూడా ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి.

అత్యంత చౌకైన పెట్రోల్ ఎక్కడ?

ప్రపంచంలో అత్యంత చౌకైన పెట్రోల్ ఇరాన్ లో లభిస్తోంది. అక్కడ లీటరు ధర కేవలం $0.029 (సుమారు రూ.2.69) మాత్రమే. విస్తారమైన చమురు నిల్వలు ఉన్నాయి, ప్రభుత్వ సబ్సిడీలు దేశంలో అందించడానికి కారణాలు. ఇరాన్ తర్వాత వెనిజులలో కూడా పెట్రోల్ చాలా తక్కువ ధరకు లభిస్తోంది. అక్కడ కూడా సహజ వనరులు అధికంగా ఉండటం వల్ల ఇంధన ధరలు ఉన్నాయి.

కాగా దేశాలను బట్టి పెట్రోల్ ధరల్లో ఈ భారీ వ్యత్యాసానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ముడి చమురు ఉత్పత్తి, దిగుమతులపై ఆధారపడటం.. పన్నులు, సబ్సిడీలు, కరెన్సీ మార్పిడిలు వీటిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగితే, రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయంపై మరింత భారంగా మారే అవకాశం ఉంది.

మరోవైపు మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అక్కడ డీజిల్ ధరలు 54.9 శాతం పెరిగి లీటరుకు రూ.520.35కు చేరగా.. పెట్రోల్ ధరలు 42.7 శాతం పెరిగి రూ.458.40కు పెరిగాయి.

2,801 Views

You may also like

Leave a Comment