
అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గేలా కనిపించడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ అక్కడి పరిస్థితి యుద్ధ వాతావరణాన్నే తలపిస్తోంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అయితే లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు సీజ్ ఫైర్ ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. తమ ఫింగర్స్ ట్రిగ్గర్ పైనే. లెబనాన్ ను ఒంటరిగా వదిలేయమని తేల్చి చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
“లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్నాయి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినట్టే. ఇది ఓ క్రూరమైన చర్యకు నాంది. భవిష్యత్తులో జరగనున్న చర్చలకు ఈ దాడులు జరగడానికి వీలు కల్పిస్తుంది. ఇరు దేశాల మధ్య చర్చలకు ఈ దాడులు అడ్డంగా మారాయి. ఇక చర్చలు జరగాలంటే ఏం చేయాలి. మా ఫింగర్స్ ట్రిగ్గర్ పైనే ఉంది.” వార్నింగ్ ఇచ్చారు.
అలాగే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ భాగేర్ సైతం ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని. తమ సరిహద్దు దేశాలను కాపాడుకోవడంలో ఇరాన్ పాత్ర చాలా ఉందని తెలుస్తోంది. సీజ్ ఫైర్ కిందకు లెబనాన్ కూడా వస్తుందని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మహమ్మద్ భాగేర్ పోస్టు పెట్టారు.
تجاوز డూబారహ్ రంగం ఐన్ న్సాన్హ్ అస్ర్నాకి అస్ ఫ్రిబ్ మరియు అద్మ్ పాయిబ్ంది బహి టూఫ్కాట్ అహత్మాలి అస్త్. తడవూమ్ ఐన్ అఖ్దామత్స్ మాక్రాహ్ రా బైమ్యూనా షావాహద్ కార్డ్. దస్త్రం ఐరాన్ హర్గస్ మరియు బ్రదర్న్ లబ్నాని రా తన్హా నజ్వాహద్ కస్ట. https://t.co/T3Wy3qBqcE
— మసౌద్ పెజెష్కియాన్ (@drpezeshkian) ఏప్రిల్ 9, 2026
ఇక లెబనాన్ పై ఇజ్రాయెల్ వరుసబెట్టి దాడులు చేస్తోంది. తాజాగా గురువారం చేపట్టిన దాడుల్లో లెబనాన్‌లో దాదాపు 250 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మాట్లాడుతూ.. హెజ్ బొల్లాపై మిలిటరీ దాడులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. హెజ్ బొల్లాపై కచ్చితత్వమైన మిలిటరీ దాడులను ఇజ్రాయెల్ సైన్యం చేస్తుందని తెలిపారు. తాము ఒకటేనని.. ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటారో వారిపై దాడులు జరుగుతున్నాయని తేల్చి చెప్పారు. అలాగే ఇజ్రాయెల్ ఎప్పుడనుకుంటే అప్పుడు హెజ్ బొల్లాపై దాడులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

ఇక ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే లెబనాన్ పై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేసింది. వందలాది ఫైటర్ జెట్స్ తో లెబనాన్ పై విరుచుకుపడింది. కేవలం 10 నిమిషాల్లోనే 100 కు పైగా లక్ష్యాలను ఛేదించింది.. ఇది హెజ్ బొల్లాకు ఊహించని దెబ్బ అని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. ఈ దాడుల్లో లెబనాన్‌లో దాదాపు 200 మందికి పైగా మరణించినట్లు సమాచారం.