

సినిమా పేరు: డెకాయిట్
నటీనటులు: అడివిశేష్ , మణణాల్ ఠాకూర్, ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల స్థానం
సినిమాటోగ్రఫీ: ధనుష్ భాస్కర్
ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్
సంగీతం: భీమ్స్
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
సహా నిర్మాత: సునీల్ నారంగ్
బ్యానర్స్: ఎస్ ఎస్ క్రియేషన్స్ , సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్
రచన,దర్శకత్వం: షానియెల్ డియో
విడుదల తేదీ: ఏప్రిల్ 10, 2026
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ‘డెకాయిట్’తో సెల్యులాయిడ్ పై అడుగుపెట్టాలని ఎంత ఆత్రుతతో ఎదురుచూసారో, అభిమానులు, మూవీ లవర్స్ అంతకు వంద రేట్లు ఆత్రుతతో ఎదురుచూశారు. ప్రచార చిత్రాలతో వచ్చిన క్రేజ్ అలాంటిది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
హరి(అడివి శేష్), సరస్వతి(మృణాల్ ఠాకూర్) ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. కానీ సరస్వతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక పాపకి కూడా జన్మనిస్తుంది. హరి 10 సంవత్సరాలపై నుంచే ఖైదీగా జైలులో ఉండి తప్పించుకొని బయటకి వస్తాడు.సరస్వతి, హరి కలిసి కరుణ హాస్పిటల్ కి సంబంధించిన డబ్బుని దొంగతనం చేయాలని నిర్ణయించుకుంటారు.ప్రేమించుకున్న ఆ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు? హరి ఎందుకు జైలు పాలయ్యాడు? అందుకు కారణం ఎవరు? జైలు నుంచి తప్పించుకోవడానికి కారణం ఏంటి? సరస్వతి, హరి కలిసి డబ్బు ఎందుకు దొంగతనం చేయాలనుకుంటున్నారు? రాంబాబు(అనురాగ్ కశ్యప్), సోమనాధ్ రెడ్డి(ప్రకాష్ రాజ్), మల్లి(కామాక్షి బాసర్ల)ల క్యారెక్టర్స్ ఏంటి? అసలు డెకాయిట్ లో దాగి ఉన్న అసలు కథ ఏంటి అనేదే ఈ చిత్రం.
ఎనాలసిస్
అదిరిపోయే మాస్ టైటిల్‌తో వచ్చినా దానికి తగ్గట్టు అడివి శేష్ మాస్ అప్పీరియన్స్ ఇచ్చినా అంతా ఆర్టిఫిషియల్‌గా ఉంది. స్టార్ హీరోలా బిహేవ్ చేశాడేగానీ.. క్యారెక్టర్‌లోకి వెళ్లలేకపోయాడు ముందుగా అనుకున్న శృతిహాసన్‌పై కొన్ని సీన్స్‌ని తెరకెక్కించి ఆమెని మార్చడమే కాకుండా, మూవీ సెట్స్‌పై కథను చాలాసార్లు మార్చేశారు. ఆ విషయం అర్ధమవుతుంది. అంతల కథ అతుకుల బొంతగా వుంది. హాస్పిటల్ సీన్స్ లో నాచురాలిటీ లేదు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మొదటి పావు గంటలోనే టాక్ విషయంలో డెకాయిట్ కి అన్యాయం జరుగుతుందా అనిపిస్తుంది. అంతలా సీన్స్ వర్క్ అవుట్ కాలేదు. హరి, సరస్వతి మధ్య లవ్ సీన్స్ కూడా అంతే. జైలు నుంచి పారిపోయే తాను చనిపోయినట్టుగా హరి చాలా ఈజీగా క్రియేట్ చేయచ్చు. కానీ పోలీసుల చూస్తుండగా పారిపోవడం అనేది వర్క్ అవుట్ కాలేదు. ఆ తర్వాత సరస్వతి విషయంలో హరి తీసుకున్న నిర్ణయంతో మంచి ఎగ్జైట్ మెంట్ కి లోనవుతాం. కానీ ఆ మధ్య వచ్చే సీన్స్ లోకి వెళ్లే కొద్దీ ఇద్దరికీ క్యూరియాసిటీ అనేది పండలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అంతే కిక్ ని ఇచ్చింది లేదు.
సెకండ్ హాఫ్ చూసుకుంటే కథ ఏ విధంగా జరగబోతుందో ముందుగానే ఊహించుకుంటాం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చెప్పే విధానం బాగున్నా గందరగోళంగా తీర్చిద్దాడు. సరస్వతిలో దాగి ఉన్న అసలు విషయం బాగానే ఉండటంతో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగుంది. ఇక లాంగ్వేజ్ పరంగా యాసని డిఫరెంట్‌గా ట్రై చేయడంతో చాలా డైలాగ్స్ అర్థం కాలేదు. అసలు స్పష్టత కూడా లేదు. మేకర్స్ ఈ విషయంపై ఎందుకు దృష్టి సారించలేదో అర్ధం కాదు. లాజిక్ లేని సీన్స్‌ని ఈజీగా కనిపెట్టేయొచ్చు. ఒకవైపు ఆపద తరుముకొస్తుంటే చర్చలు పెడతారు. మాట్లాడుకునేంత టైం లేకపోయినా.. తెగ మాట్లాడుకుంటారు. వాళ్లేమిటో..వాళ్ల విధానాలేమిటో అర్థం కాదు.
శేషు, మృణాల్ మధ్య కెమిస్ట్రీనే కాదు.. ఎమోషన్ పండలేదు. మృణాల్ యాక్టింగ్ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఐటంసాంగ్ మినహా భీమ్స్ సిసిరోలియో క్యాచీ ట్యూన్ ఒక్కటీ ఇవ్వలేకపోయాడు. కెమెరామెన్ డైరెక్టర్ షానిల్ డియోగా పరిచయమయ్యాడు. అడవి శేషు సినిమాలకు డైరెక్టర్‌తో పని లేదు. కథ, స్క్రీన్‌ప్లే అన్నీ తానై చూసుకుని హిట్ చేసుకునే అడవి శేషు ఈసారి తడబడ్డాడు.
నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు
హరిగా అడివి శేష్ తన క్యారక్టర్ లో పర్లేదు. కారణాలు తెలియదు గాని అడివి శేష్ కనపడ్డాడు తప్ప హరి కనపడలేదు. మృణాల్ ఠాకూర్ అయితే ఒక రేంజ్ లో విజృంభించి నటించింది. అంత ఎలా యాక్ట్ చేస్తుంది, మనం కూడా తన లాగా హీరోయిన్ అవ్వాలంటే ఎలా అని అమ్మాయిలు ఆలోచించేలా పెర్ఫార్మ్ చేసింది. అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, కామాక్షి బాసర్ల తమ క్యారెక్టర్స్ కి నిండు తనాన్ని తెచ్చారు. పైన మనం చెప్పుకున్నట్టే భీమ్స్ నుంచి ఆశించినంత సాంగ్స్ రాలేదు. ధనుష్ భాస్కర్ ఫొటోగ్రఫీ, బిజిఏం ఒక రేంజ్ లో ఉండి డెకాయిట్ కి న్యాయం చేసారు. నిర్మాణ విలువలుసూపర్ . అబ్బూరి రవి నుంచి డైలాగ్స్ బాగాలేదు. షానియెల్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఒక్కో సీన్ ని అద్భుతమైన టేకింగ్ తో హాలీవుడ్ స్టైల్లో తీర్చిదిద్దాడు. కానీ రచయితగా డెకాయిట్ కి తీరని అన్యాయం చేసాడు.
బలాలు
1 . అడివి శేష్, మృణాల్ పెర్ ఫార్మెన్స్
2 . ఆ ఇద్దరు కలిసి దొంగతనం చేయాలనుకునే పాయింట్
3 .ఫొటోగ్రఫీ
4 .క్లైమాక్స్
బలహీనతలు
1 .కథ
2 .ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో సాగతీతగా నడిచే కథనం
3 . డైలాగ్స్
4 . లాజిక్ లేని సీన్స్
5 . ఏ క్యారక్టర్ కి సరైన జస్టిఫై ఇవ్వకపోవడం
చివరిగా చెప్పుకోవాలంటే డెకాయిట్ లాంటి పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసి త్యాగాల ప్రేమికుడిని చూపించారు. మృణాల్ పెర్ఫార్మ్ హైలెట్.
రేటింగ్ 2 .25/5
అరుణాచలం