
దళపతి విజయ్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ‘జననాయకన్’ చిత్రం ఇప్పుడు కష్టాల్లో పడింది. ఈ చిత్రం టోటల్‌గా లీక్ అయింది. అది కూడా హెచ్‌డి ప్రింట్ ఆల్‌లైన్‌లోకి వచ్చేసింది. దీనితో చిత్ర యూనిట్ షాక్‌కి గురైంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా సెన్సార్ సమస్యల కారణంగా రిలీజ్ సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు.
ఇప్పుడు సినిమా లీక్ అవ్వడం ఈ నిర్మాణంలో కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ సంస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. దానికి సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు చిత్ర యూనిట్ క షి చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇదే బేనర్‌లో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 11న లాంచ్ చెయ్యాలని భావించారు. అయితే ఇప్పుడు జననాయకన్ లీక్ వ్యవహారంలో నిర్మాణ సంస్థ తలమునకలై ఉండటంతో చిరంజీవి, బాబీ చిత్ర ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
తెలుగులో నందమూరి బాలక ష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ‘భగవంత్ కేసరి’ ఆధారంగా ‘జననాయకన్’ చిత్రాన్ని రూపొందించారు. అయితే స్టోరీ లైన్ తీసుకొని దాన్ని తమిళ నేటివిటీకి, విజయ్ ఇమేజ్‌కి సరిపోయేట్టుగా మార్పులు, చేర్పులు ప్రదర్శించబడ్డాయి. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆన్‌లైన్‌లో పూర్తి సినిమా అక్కడకు రావడం ఇప్పటివరకు మనం చూశాం. కానీ, ఒక సినిమా రిలీజ్ అవ్వకుండానే హెచ్‌డి ప్రింట్ ఆన్‌లైన్‌కి వచ్చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.