Home ట్రెండింగ్ విజయ్ ప్రచారంలో దారుణం: అభిమానులను బూట్లతో తన్నిన బౌన్సర్లు | విజయ్ TVK ప్రచార వివాదాలు: తమిళనాడు 2026 ఎన్నికలలో భారీ గుంపుల మధ్య బౌన్సర్లు అభిమానులపై దాడి చేశారు – VRM MEDIA

విజయ్ ప్రచారంలో దారుణం: అభిమానులను బూట్లతో తన్నిన బౌన్సర్లు | విజయ్ TVK ప్రచార వివాదాలు: తమిళనాడు 2026 ఎన్నికలలో భారీ గుంపుల మధ్య బౌన్సర్లు అభిమానులపై దాడి చేశారు – VRM MEDIA

by VRM Media
0 comments
విజయ్ ప్రచారంలో దారుణం: అభిమానులను బూట్లతో తన్నిన బౌన్సర్లు | విజయ్ TVK ప్రచార వివాదాలు: తమిళనాడు 2026 ఎన్నికలలో భారీ గుంపుల మధ్య బౌన్సర్లు అభిమానులపై దాడి చేశారు


భారతదేశం

ఓయి-లింగారెడ్డి గజ్జల

తమిళనాడు రాజకీయ రణక్షేత్రంలో అడుగుపెట్టిన నటుడు విజయ్.. తన ప్రచారంతో సునామీ సృష్టిస్తున్నారు. మధురై నుండి చెన్నై వరకు ఆయన నిలిచిన ప్రతి నియోజకవర్గం జనసంద్రంగా మారుతోంది. అయితే, ఈ క్రేజ్ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇటీవల శివగంగ జిల్లా కారైకుడిలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.

నేటి యువతకు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ అంటే ఎంత పిచ్చో తెలుస్తుంది. విజయ్ ప్రచార వాహనం వెనుక వందలాది బైకులు, యువకులు ప్రమాదకరంగా వెంబడిస్తున్నారు. కదులుతున్న వాహనంపైకి ఎక్కి సెల్ఫీలు తీయడానికి, వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కోరికనే కారైకుడిలో కొందరు అభిమానులు విజయ్ వాహనంపైకి ఎక్కడానికి ప్రయత్నించారు.. అక్కడ ఉన్న ప్రైవేట్ బౌన్సర్లు వారిని బూట్లతో తన్ని కిందకు తోసేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు “అభిమానం సరే.. కానీ ఈ అరాచకం ఏంటి?” అని ప్రశ్నిస్తున్నారు.

విజయ్ యొక్క TVK ప్రచార వివాదాలు తమిళనాడు 2026 ఎన్నికలలో భారీ గుంపుల మధ్య అభిమానులపై బౌన్సర్లు దాడి చేశారు

విజయ్ పై పోలీసు కేసులు..

కేవలం భద్రతా వివాదాలే కాదు, న్యాయ చిక్కులు కూడా విజయ్‌ను చుట్టుముడుతున్నాయి.

మధురై & చెన్నై:

మధురై కాన్ఫరెన్స్ మరియు చెన్నై పెరంబూర్ ర్యాలీల్లో అనుమతించిన దానికంటే ఎక్కువ మందిని సమీకరించడం, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించినందుకు విజయ్‌పై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

నామినేషన్ గందరగోళం:

విజయ్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో కూడా తనపై ఉన్న కేసుల వివరాల విషయంలో చిన్న చిన్న వ్యత్యాసాలు రావడం, వాటిని సరిదిద్దడానికి ఆయన కోర్టు మెట్లు ఎక్కడం చర్చనీయాంశంగా మారాయి.

బౌన్సర్ల అతి.. వృద్ధుడిపై దాడి?

జనసందోహాన్ని నియంత్రించే నెపంతో ప్రైవేట్ బౌన్సర్లు అతిగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మధురైలో ఒక అభిమానిని ర్యాంప్ పై నుంచి కిందకు తోసేయడం, చెన్నైలో ఒక వృద్ధుడిపై కూడా చేయి చేసుకున్నారనే వార్తలు పార్టీకి మైనస్ గా మారుతున్నాయి. “ప్రజాస్వామ్యంలో బౌన్సర్ల సంస్కృతి ఏంటి?” అని ప్రతిపక్షాలు విజయ్‌ను టార్గెట్ చేస్తున్నాయి.

ప్రభుత్వం వర్సెస్ టీవీకే

ఇదిలా ఉంటే, అధికార డీఎంకే ప్రభుత్వం తన ప్రచారాన్ని అడ్డుకుంటుందని విజయ్ ఆరోపిస్తున్నారు. చెన్నైలోని టీ నగర్, విల్లివాక్కం వంటి ప్రాంతాలలో ప్రచారాన్ని తగ్గించడంపై టీవీకే నేతలు మండిపడుతున్నారు. తమ నాయకుడికి వస్తున్న ఆదరణ చూసి భయపడే పోలీసులు అనుమతులు నిరాకరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అభిమానుల ఆర్తనాదాలు, మరోవైపు పోలీసుల ఆందోళనలు, ఇంకోవైపు బౌన్సర్ల దాష్టీకాలు.. వీటన్నింటి మధ్య విజయ్ 2026లో తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తారో చూడాలి.



2,801 Views

You may also like

Leave a Comment