[ad_1]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'స్పిరిట్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో ఉంది. అయితే, తాజాగా ఈ సినిమా సెట్లో జరిగిన ఒక ప్రమాదం అందరినీ కంగారు పెట్టింది.
షూటింగ్ కోసం సెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో సెట్లోని కొన్ని టెంట్లు, ఇతర సినిమా సామాగ్రి పాక్షికంగా కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన చిత్రయూనిట్ మంటలను అదుపులోకి తెచ్చింది.
ఈ ఘటనలో చిత్ర బృందానికి సహాయం చేసే బృందంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయనకు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. ప్రాణనష్టం జరగలేదు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాస్ సెట్లో లేరు. ఈ వార్త తెలియగానే ఆయన అభిమానులు మొదట ఆందోళన చెందినప్పటికీ, ఆయన సురక్షితంగా ఉన్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సెట్లో మరమ్మతులు చేపట్టి, త్వరలోనే మళ్లీ షూటింగ్ ప్రారంభించాలని మూవీ టీమ్ అనుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. 'యానిమల్' తర్వాత సందీప్ రెడ్డి వంగా తీస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird