Home ట్రెండింగ్ నల్లగా ఉన్నావ్, నా అందం వాడికే దక్కాలి.. ప్రియుడితో కలిసి భర్త | ధార్ మర్డర్ మిస్టరీ వీడింది: ప్రేమికుడి సహాయంతో చీకటి కారణంగా భర్తను చంపినందుకు మహిళ అరెస్ట్ – VRM MEDIA

నల్లగా ఉన్నావ్, నా అందం వాడికే దక్కాలి.. ప్రియుడితో కలిసి భర్త | ధార్ మర్డర్ మిస్టరీ వీడింది: ప్రేమికుడి సహాయంతో చీకటి కారణంగా భర్తను చంపినందుకు మహిళ అరెస్ట్ – VRM MEDIA

by VRM Media
0 comments
నల్లగా ఉన్నావ్, నా అందం వాడికే దక్కాలి.. ప్రియుడితో కలిసి భర్త | ధార్ మర్డర్ మిస్టరీ వీడింది: ప్రేమికుడి సహాయంతో చీకటి కారణంగా భర్తను చంపినందుకు మహిళ అరెస్ట్


భారతదేశం

ఓయి-లింగారెడ్డి గజ్జల

ఏప్రిల్ 7వ తేదీ అర్ధరాత్రి.. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా గోండిఖేడ గ్రామంలో ఒక ఇంట్లో నుంచి ఆర్తనాదాలు వినిపించాయి. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది. సామాన్లు కిందపడి ఉన్నారు. యజమాని దేవకృష్ణ పురోహిత్ (28) రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. ఆయన భార్య ప్రియాంక చేతులు కట్టేసి ఉండి, ఏడుస్తూ కనిపించింది. దొంగలు పడి తన భర్తను చంపేశారని, నగలు, రూ.3.5 లక్షలు ఎత్తుకెళ్లారని ఆమె చెప్పిన కథ నమ్మి పోలీసులు మొదట దోపిడీ కేసుగా భావించారు.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు మొదటి రోజే కొన్ని సందేహాలు మొదలయ్యాయి. దేవకృష్ణ సోదరి ఇచ్చిన వాంగ్మూలం కేసును మలుపు తిప్పింది. “నా తమ్ముడు నల్లగా ఉన్నాడని ప్రియాంక ఎప్పుడూ ఎగతాళి చేసేది. నువ్వు నాకు సరిపోవు, నీకంటే అందమైన వాడు నాకు దక్కాలి అంటూ గొడవ పడేది” అని ఆమె పోలీసులకు అందించింది. కేవలం చర్మం రంగు కారణం కాదని, దీని వెనుక ఏదో బలమైన కారణం ఉందని పోలీసులు లోతుగా ఆరా తీశారు.

ధార్ మర్డర్ మిస్టరీ ఛేదించిన మహిళ తన ప్రేమికుడి సహాయంతో చీకటి కారణంగా భర్తను చంపినందుకు అరెస్ట్

బయటపడ్డ ‘పాత’ ప్రేమాయణం..

ప్రియాంక కాల్ డేటాను నిశితంగా, ఆమెకు 2020 నుంచి కమలేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. వీరిద్దరూ పెళ్లికి ముందే ప్రేమించుకున్నారని, కానీ పెద్దలు బలవంతంగా దేవకృష్ణతో పెళ్లి చేశారని వెల్లడయ్యింది. అడ్డంకిగా ఉన్న భర్తను వదిలించుకోవడానికి ప్రియాంక, కమలేష్ కలిసి ఒక భయంకరమైన కుట్ర పన్నారు.

లక్ష రూపాయల సుపారీ.. అర్థరాత్రి ఘాతుకం!

పక్కా ప్లాన్ ప్రకారం.. కమలేష్ తన స్నేహితుడు సురేంద్ర భట్‌ను రూ. లక్ష సుపారీకి మాట్లాడుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ. 50 వేలు చెల్లించారు. హత్య జరిగిన రాత్రి ప్రియాంక కావాలంటే ఇంటి తలుపులు తీసి ఉంచింది. సురేంద్ర లోపలికి చొరబడి నిద్రిస్తున్న దేవకృష్ణపై పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చాడు. ఆ తర్వాత సినిమా స్టైల్లో.. ఇంట్లో వస్తువులను చెల్లాచెదురు చేసి, నగలను దాచిపెట్టి, ప్రియాంకను తాళ్లతో కట్టేసి దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించారు.

36 గంటల్లోనే అడ్డంగా దొరికిపోయింది!

దర్యాప్తు చేస్తున్న సమయంలో ప్రియాంక నాగులు ఇంట్లోనే ఒక మూల దొరకడంతో పోలీసుల అనుమానం బలపడింది. ఎస్పీ మయాంక్ అవస్తి ఆధ్వర్యంలో పోలీసులు ఆమెను గట్టిగా విచారించగా, పొంతన లేని సమాధానాలు చెప్పి అడ్డంగా దొరికిపోయింది. తన ప్రియుడి కోసం భర్తను చంపినట్లు ఆమె నేరాన్ని అంగీకరించింది. కేవలం 36 గంటల్లోనే పోలీసులు ఈ మిస్టరీని ఛేదించి ప్రియాంక, కమలేష్‌లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సురేంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు. భర్త అందగాడు కాదని, నల్లగా ఉన్నాడని అవమానించిన ఆ ఇల్లాలు.. కట్టుకున్నవాడి ప్రాణాలను తీసి ఇప్పుడు కటకటాల పాలైంది.



2,803 Views

You may also like

Leave a Comment