
భారతదేశం
ఓయ్-జక్కీ మహేష్
ఐటీ రంగం అంటేనే భారీ వేతనాలు, విలాసవంతమైన జీవితం. ఏసీ గదుల్లో లక్షల రూపాయల ప్యాకేజీలతో కెరీర్‌లో దూసుకుపోతున్న వారికి ఒక్కసారికి లేఆఫ్స్ అనే పిడుగు లాంటి వార్త తగిలితే జీవితం ఎంత తలకిందులవుతుందో ఈ ఉదంతమే సాక్ష్యం. నిన్నటి వరకు కోడింగ్‌తో కుస్తీ పట్టిన వేళ్లు.. నేడు ఇంటి ఈఎంఐలు కట్టుకోవడానికి బైక్ హ్యాండిల్ పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదికి రూ. 40 లక్షల జీతం సంపాదించిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఉద్యోగం పోవడంతో తన కలల సౌధాన్ని కాపాడుకోవడానికి ప్రస్తుతం రాపిడో రైడర్‌గా మారిన దీనగాధ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లోబల్ ఐటీ దిగ్గజం ఓరాకిల్‌లో జరిగిన భారీ ఉద్యోగాల కోత, మధ్యతరగతి సాంకేతిక నిపుణుల జీవితాల్లో ఎలాంటి అలజడి సృష్టించిందో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
రూ. 40 లక్షల ప్యాకేజీ.. రూ. 95 వేల ఈఎంఐ!
నోయిడాకు చెందిన ఓ టెక్కీ 2024లో తన కలల సౌధాన్ని నిర్మించుకోవాలని రూ. 1.4 కోట్లు వెచ్చించి ఓ 3బీహెచ్‌కే ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. నెలకు రూ. 95 వేల ఈఎంఐ పడుతున్నా.. తనకున్న రూ. 40 లక్షల వార్షిక వేతనంతో అది పెద్ద భారమని అతను భావించలేదు. అయితే 3 నెలల క్రితం అతను తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. చేతిలో జీతం లేకపోవడం, తిరిగి బ్యాంకు వాయిదా గడువు ముంచుకురావడంతో అతని జీవితం తలకిందులైంది.

సాఫ్ట్‌వేర్ ఆఫీస్ నుంచి రోడ్డుపైకి..
ఉద్యోగం పోయిన తర్వాత గత 3 నెలలుగా సరైన అవకాశం దొరక్క, కనీసం ఇంటి కిస్తీలు కట్టడానికైనా డబ్బులు కావాలని ఆ టెక్కీ ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏసీ గదుల్లో కూర్చొని కోడింగ్ రాసే స్థాయి నుంచి, ఎండలో తిరుగుతూ ‘రాపిడో’ బైక్ టాక్సీ స్థితికి చేరుకున్నాడు. ప్రతి రోజూ ఉదయాన్నే రోడ్డుపైకి వచ్చి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ.. వచ్చే కొద్దిపాటి ఆదాయంతో లక్షకు దగ్గరగా ఉన్న ఈఎంఐని చెల్లించడానికి ప్రయత్నించాడు. అతని స్నేహితుడు సోషల్ మీడియాలో ఈ దీనగాధను పంచుకోవడంతో చాలా మంది ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1.4 కరోడ్ కా 3BHK లియా జబ్ జీతం 40 LPA థీ లేకిన AB జాబ్‌లెస్ ఉంది 20 వేలకు 95 హ్యాజర్ EMI కైసేస్ నిర్వహించండి
అభి నేను అపనే దోస్త్ సే మిలకర్ ఆ రహా థా ప్రతీక్ గ్రాండ్ సిటీ సే ఉసానే 2024 నుండి 3BHK ఫ్లాట్ లియా థా కరీబ్ 1.
उस समय उसका శాలరీ ప్యాకేజ్ 40 LPA థా పహలే టు ఎక్సైట్మెంట్ మెం లె… pic.twitter.com/kDBdYuYTQa
— వివేక్ (@Vivek_4580ji) ఏప్రిల్ 9, 2026
ఓరాకిల్ లేఆఫ్స్ కలకలం
ఈ కథనం బయటకు వచ్చిన సమయంలోనే ప్రముఖ ఐటీ దిగ్గజం ‘ఓరాకిల్’ (ఒరాకిల్) ఇండియాలో సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30,000 మందిని తొలగించిన ఈ సంస్థ.. మరో విడత కోతలకు కూడా సిద్ధమవుతోందని సమాచారం. ఓరాకిల్ మాజీ ఉద్యోగి మేరుగు శ్రీధర్ వంటి వారు చెబుతున్న దాని ప్రకారం.. రోజుకు 16 గంటల పని ఒత్తిడిని వ్యతిరేకించిన వారిని కూడా నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. అమెరికాలోని కఠినమైన లేబర్ చట్టాల ప్రభావం అక్కడ భారతీయులపై కూడా తీవ్రంగా ఉంది.
హెచ్చరిక లాంటి కథ..
సాధారణంగా ఐటీ రంగంలో భారీ వేతనాలు అందరినీ ఊరిస్తుంటాయి. అయితే ఆ జీతం ఆగిపోయిన మరుక్షణమే అధిక రుణ భారం ప్రాణాల మీదికి తెస్తుందని ఈ ఘటన నిరూపిస్తోంది. “మనం కలలు కనేటప్పుడు, సంపాదన అకస్మాత్తుగా ఆగిపోతే మన పరిస్థితి ఏంటనేది ముందే ఆలోచించుకోవాలి” అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లక్షల జీతాలు ఇచ్చే భద్రతా భ్రమ నుంచి బయటపడింది.. అత్యవసర సమయాల కోసం పొదుపు చేయడం ఎంత ముఖ్యమో ఈ రాపిడో రైడర్ కథ కళ్లకు కడుతోంది.