[ad_1]
తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఆన్ లైన్ బ్యాంకింగ్ వాడకం పెరిగింది. దాంతో కొందరు మోసగాళ్లు కొత్త తరహా శిక్షణతో టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నగరంలో వాటర్ బోర్డు బిల్లుల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్వాసులకు కీలక సూచనలు చేశారు.
హైదరాబాద్ నగరంలో వాటర్ బోర్డుల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. "మీ నీటి బిల్లు బకాయి ఉంది. వెంటనే డబ్బులు చెల్లించకపోతే వాటర్ కనెక్షన్ కట్ చేస్తాం" అంటూ వాటర్ బోర్డు అధికారుల పేరుతో ఫోన్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఆపై HMWSSB వాటర్ బిల్ అప్డేట్. apk పేరుతో ఒక ప్రమాదకరమైన లింక్‌ను పంపి, దాన్ని స్టాల్ చేయాలని నమ్ముతున్నారు. ఒక్కసారి ఆ ఏపీకే ఫైల్ ను మీ ఫోన్లో డౌన్లోడ్ చేస్తే, మీ మొబైల్ నియంత్రణ మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. మీ కాల్స్‌ను డైవర్ట్ చేయడమే కాకుండా, మీ స్క్రీన్‌ను నిరంతరం గమనిస్తూ బ్యాంక్ లావాదేవీలకు వచ్చే ఓటీపీలను తస్కరించి క్షణాల్లో ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
నగరవాసులు ఇలాంటి బెదిరింపులకు ఆందోళన చెందవద్దు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఎటువంటి ఏపీకే ఫైళ్లను పొరపాటున కూడా ఇన్ స్టాల్ చేయకండి. కేవలం అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారా మీ నీటి బిల్లులు చెల్లించండి. ఎవరైనా అనుమానాస్పదంగా ఫోన్ చేస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి.

ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేయండి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు!! అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird