
వ్యాపారం
ఓయ్-చంద్రశేఖర్ రావు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తులపై ఎగుమతి సుంకాలను భారీగా పెంచింది. ప్రత్యేకించి డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ట్యాక్స్ ను ఎకాఎకిన సవరించింది. పెట్రోల్‌పై ఎగుమతి సుంకం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. ఇందులో ఎటువంటి సవరణలు చేయలేదు కేంద్రం. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, రోజురోజుకూ ముడిచమురు ధరలు పెరుగుతోండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా సవరించిన ధరల ప్రకారం.. డీజిల్ ఎగుమతి సుంకాన్ని లీటరుకు. 21.50 పైసల నుండి రూ. 55.50 పైసలకు పెరిగింది. ఒకేసారి 36 రూపాయల మేర పెరుగుదల సంభవించింది. హై స్పీడ్ డీజిల్‌పై కూడా ట్యాక్స్ భారం పడింది. దరఖాస్తు ప్రత్యేక అదనపు ఎక్స్సైజ్ ను వేసింది కేంద్రం. పెంపు తర్వాత లీటరు ఒక్కింటికి 24 రూపాయలకు చేరుకుంది. రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఇప్పుడు లీటరుకు 36 రూపాయలుగా నిర్ణయించింది.

అదేవిధంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతి ట్యాక్స్ లీటరుకు రూ. 29.50 పైసల నుండి 42 రూపాయలకు పెరిగింది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో శాఖ స్పష్టం చేసింది. అధిక ఇంధన ధరలు విమానాలపై పడకుండా ఉండటం, అంతర్జాతీయ చమురు ధరల అస్థిరత ప్రభావం పౌర విమానయాన, రంగం ప్రయాణికులపై పడకుండా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పన్నులు, ఇతరత్రా ఎక్సైజ్ డ్యూటీలపై సమీక్ష కొనసాగుతోందని.
ఇదివరకు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలు పారిశ్రామిక డీజిల్ ధరను 25 శాతం మేర పెంచిన విషయం తెలిసిందే. దీంతో బల్క్ కొనుగోలుదారులకు ఇప్పుడు లీటరు రూ. 137.81 చెల్లించాల్సి వస్తోంది. ఇది ముందు ధర కంటే రూ. 28.22 అధికం. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ ముడిచమురు మార్కెట్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయి, భారతీయ చమురు కంపెనీ సామాన్య వినియోగదారులపై అదనపు భారాన్ని మోపట్లేదు.
వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలు ఉన్నాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61
భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52