Home ట్రెండింగ్ ఆ రాకతో జాగ్రత్త పడ్డ ఇరాన్- అనుకున్నదంతా అయింది | పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లో చర్చలు కుప్పకూలడంతో ఇరాన్ US ప్రతిపాదనలను తిరస్కరించింది మరియు తదుపరి ఎటువంటి సంభాషణలు లేవని చెప్పింది – VRM MEDIA

ఆ రాకతో జాగ్రత్త పడ్డ ఇరాన్- అనుకున్నదంతా అయింది | పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లో చర్చలు కుప్పకూలడంతో ఇరాన్ US ప్రతిపాదనలను తిరస్కరించింది మరియు తదుపరి ఎటువంటి సంభాషణలు లేవని చెప్పింది – VRM MEDIA

by VRM Media
0 comments
ఆ రాకతో జాగ్రత్త పడ్డ ఇరాన్- అనుకున్నదంతా అయింది | పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లో చర్చలు కుప్పకూలడంతో ఇరాన్ US ప్రతిపాదనలను తిరస్కరించింది మరియు తదుపరి ఎటువంటి సంభాషణలు లేవని చెప్పింది


అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

ఇస్లామాబాద్‌లో జరిగిన దౌత్యపరమైన చర్చలు ఇప్పుడు అమెరికా- ఇరాన్ మధ్య మాటల యుద్ధంగా రూపాంతరం చెందాయి. 21 గంటల సుదీర్ఘ మారథాన్ సమావేశం ముగిసిన తర్వాత అమెరికా ప్రతినిధిగా హాజరైన ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్వదేశానికి తిరిగి వెళ్లారు. ఈ నేపథ్యంలో- ఇరాన్.. అమెరికాపై సంచలన ఆరోపణలు చేసింది. శాంతి చర్చలలో నిబద్ధతను ప్రశ్నించింది. ఇక ముందు చర్చలు జరిపే ప్రసక్తే ఉండబోదనీ తేల్చి చెప్పింది.

అమెరికా శాంతిని కోరుకోవట్లేదని చర్చలు కొలిక్కి రాకపోవడానికి, అర్ధాంతరంగా ముగియడానికి ఒక సాకును మాత్రమే అన్వేషిస్తోందని ఇరాన్ విమర్శించింది. తదుపరి విడత చర్చలు జరిపే అవకాశం ఎంత మాత్రం లేదని కూడా ఇరాన్ స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చర్చలకు విఘాతం కలిగించాయని వ్యాఖ్యానించింది.

ఇస్లామాబాద్‌లో చర్చలు కుప్పకూలడంతో ఇరాన్ US డిమాండ్‌లను తిరస్కరించింది మరియు ఇకపై ఎలాంటి సంభాషణలు లేవని చెప్పింది

చర్చలు విఫలం కావడం లేదు, జేడీ వాన్స్ అమెరికాకు తిరుగుముఖం పట్టిన అనంతరం ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఫార్స్.. ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ చర్చలను వాస్తవంగా తీసుకోలేదని, కాలక్షేపంగా భావించిందని ఆరోపించింది. ఇస్లామాబాద్ నుంచి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదని, అక్కడి నుంచి ‘పలాయనం చిత్తగించడానికి’ ఓ సాకును మాత్రమే వెతుకుతోందని ఇరాన్ మీడియా కథనాలు వెల్లడించాయి.

చర్చలు విఫలమైతే ఆ పరువు నష్టం ఇరాన్‌పై మోపడానికి వీలుగా, అమెరికా కావాలనే ఆమోదయోగ్యం కాని షరతులు విధించిందని ఇరాన్ ఆరోపించింది. టెహ్రాన్ వచ్చిన ఈ ప్రకటన రెండు దేశాల మధ్య నెలకొన్న అగాథాన్ని స్పష్టం చేసింది. 21 గంటల పాటు జరిపిన సుదీర్ఘ చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, జేడీ వాన్స్ ఖాళీ చేతులతో తిరిగి వెళ్లారని తేల్చింది. ఈ బృహత్ చర్చల తర్వాత ప్రపంచం ముందు తమ విజయాన్ని చాటి చెప్పాలని అమెరికా ఆశించింది గానీ అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు.

ఈ మొత్తం చర్చలలో అతి ముఖ్యమైన అంశం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధి. ప్రస్తుతం ఇది మూతపడింది. ఈ మార్గాన్ని తిరిగి తెరవడానికి అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది గానీ ఇరాన్ మాత్రం వెనుకంజ వేయలేదు. కఠినంగా వ్యవహరించింది. తమ అనుమతి లేకుండా ఈ సముద్ర మార్గం తెరవడానికి వీల్లేదని గట్టిగా చెప్పింది.

ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అమెరికా ప్రత్యేక రాయబారులు విట్‌కాన్, జేర్డ్ కుష్నర్‌లతో కూడిన ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు రావడం మొదటి నుంచీ ఇరాన్ కు ఇష్టం లేదు. స్టీవ్ విట్‌కాఫ్, కుష్నర్‌ల పట్ల ఇరాన్ జాగ్రత్తగా ఉంటూ వచ్చింది. గతంలో ఒమాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలలో వీళ్లిద్దరూ పాలుపంచుకున్నారు. అవి విఫలమైన తర్వాతే ఇరాన్ పై దాడులు ఆరంభం అయ్యాయి.

2,801 Views

You may also like

Leave a Comment