
అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేపట్టడంతో ప్రతీకారంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసి వేసింది. ఈ తరుణంలో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో మునిగిపోయాయి. ప్రపంచ దేశాలతోపాటు పాకిస్థాన్ కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆ దేశ ఆర్థిక పరిస్థితి పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అనేక ఇబ్బందులకు గురైంది. ఈ పాకిస్థాన్ కు సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు గుడ్ న్యూస్ చెప్పాయి.
పాకిస్తాన్ ను ఆర్థికంగా ఆదుకునేందుకు సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు ముందుకొచ్చాయి. ఈ మేరకు పాకిస్థాన్ కు 5 బిలియన్ డాలర్లు(రూ. 41,500 కోట్లు) సిద్ధం అయ్యాయి. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు ఈ మేరకు సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అసలే పాకిస్థాన్ లో విదేశీ మారక నిల్వలు పూర్తిగా పడిపోయాయి. దాంతోపాటు మీకు చెల్లించాల్సిన 3.5 బిలియన్ డాలర్లు వెంటనే చెల్లించాలని యూఏఈ అల్టిమేటం జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ కు తక్షణమే రుణ అవసరం పడిపోయింది. దానితో 5 బిలియన్ డాలర్ల విలువైన సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు ముందుకొచ్చాయి. ఈ పరీక్ష అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన డాన్ న్యూస్ చెప్పింది.
ఇటీవల యూఏఈ పాకిస్థాన్ కు ఫైనల్ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. వారికి చెల్లించాల్సిన 3.5 బిలియన్ డాలర్లు తక్షణమే చెల్లించాలని యూఏఈ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్.. ఇరాన్ కు సపోర్ట్ చేస్తోందని భావించిన యూఏఈ ఈమేరకు అల్టిమేటం జారీ చేసింది. తద్వారా పాకిస్థాన్ కు ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు సౌదీ అరేబియా, ఖతార్ ముందుకొచ్చాయి.

ఇక అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) రూల్స్ ప్రకారం.. పాకిస్థాన్ రుణ దాతలుగా ఉన్న సౌదీ అరేబియా, చైనా అలాగే యూఏఈ తమ డిపాజిట్లను కూడా కొనసాగించాల్సి ఉంటుంది. అయితే తాజా పరిణామాల దృష్ట్యా యూఏఈ స్థానంలో ఖతార్.. పాకిస్థాన్‌కు ప్రధాన ఆర్థిక మద్దతుదారుగా మారే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. మరోవైపు పాకిస్థాన్ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ ప్రస్తుతం వాషింగ్టన్ లో జరిగే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. దాంతో పాకిస్థాన్ కు మరిన్ని నిధులు సమకూరే విధంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ కు సౌదీ అరేబియా, ఖతార్ లు సాయం చేయడం ఆ దేశానికి లైఫ్ గా భావిస్తున్న నిపుణులు భావిస్తున్నారు.