[ad_1]
భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. డీఎంకే, టీవీకే, ఏఐఏడీఎంకే పార్టీలు నువ్వా..? నేనా..? అన్నట్లుగా ప్రచార పర్వాన్ని వేగవంతం చేశాయి. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి దళపతి విజయ్ పైనే ఉంది. సినిమాల్లో తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న విజయ్.. ఆ తర్వాత టీవీకే పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఆయన బరిలోకి దిగుతున్నారు. దాంతో అరవ రాజకీయాలు ఇప్పుడు విజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి.
విజయ్ ఎన్నికల ప్రచారం కూడా అదే రేంజ్ లో సాగుతోంది. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత జనం.. బహిరంగ సభలకు లక్షల్లో తరలిస్తున్నారు. కారుపై ర్యాలీ చేస్తే రోడ్డుకు ఇరులా వేలాదిమంది గుమికూడి స్వాగతం పలుకుతున్నారు. ఇక సోషల్ మీడియాలో విజయ్ ఒక్క ట్వీట్ పెడితే నిమిషాల్లో లక్షల వ్యూస్ లైక్స్ వస్తున్నాయి. దాంతో ప్రత్యర్థులకు విజయ్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అయితే తనకు కోట్లాది మంది ఫ్యాన్స్ ను విజయ్ ఓటు బ్యాంక్ గా మార్చుకుంటారా..? లేదా..? అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే విజయ్ ఎన్నికల ప్రచారానికి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నా.. ఆయన బహిరంగ సభలు, ర్యాలీలు చాలా చోట్ల రద్దు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే విజయ్ పాల్గొనాల్సిన అనేక రాజకీయ ప్రచార కార్యక్రమాలు అనూహ్యంగా రద్దు అవుతున్నాయి. దీనికి గల కారణాలు తెలియడం లేదు. ఓవైపు భద్రతా కారణాల దృష్ట్యా.. ఎన్నికలకు ముందు మరో కరూర్ లాంటి ఘటన జరగకుండా విజయ్ జాగ్రత్త పడుతున్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడున్న తక్కువ సమయంలో కరూర్ లాంటి తొక్కిసలాట జరిగితే విజయ్ పార్టీకి పెద్ద మైనస్ అవుతుంది. అందుకే విజయ్ కావాలనే ర్యాలీలు, బహిరంగ సభలను రద్దు చేయడానికి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు.
సైకిల్ ఎక్కిన వాడు ఓడినట్టు చరిత్రలో లేదు.
అప్పుడు: #ఎన్టీఆర్
ఇప్పుడు: #విజయ్ #TVK విజయ్ #తలపాటి విజయ్ pic.twitter.com/B3jw3ZEpMT
— మిలాగ్రో మూవీస్ (@MilagroMovies) ఏప్రిల్ 12, 2026
మరోవైపు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో విజయ్ తన చివరి బ్రహ్మాస్త్రం అయిన సైకిల్ ను ప్రయోగించారు. విజయ్ సైకిల్ మీద ఎన్నికల ప్రచారం నిర్వహించి అందరినీ ఫిదా చేశారు. గతంలోనూ చాలాసార్లు విజయ్ సైకిల్ పై వెళ్లి ఓటు వేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన సైకిల్ వెంట వేలాదిగా ఫ్యాన్స్ తరలివచ్చారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని విజయ్ ప్రయోగించినట్లు స్పష్టం అవుతోంది. విజయ్ సైకిల్ మీద విజిల్ వేసుకుంటూ ఓటర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. దాంతో విజయ్ కూడా మనలాంటి ఓ సామాన్యుడే అన్న సంకేతం రాష్ట్ర ప్రజలకు వెళ్లాలని విజయ్ కోరుకుంటున్నారు.

ఇక విజయ్ సైకిల్ తొక్కిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. సైకిల్ తొక్కినోళ్లు ఓడినట్లు చరిత్రలో లేదు.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే విజయ్ సైకిల్ టూ సీఎం సీటు గ్యారంటీ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్ ఈ సారి రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. ఇక తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు గాను ఒకే దశలో ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగుతున్నాయి. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird