[ad_1]
తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్గా మార్పు చేయాలని భావిస్తున్నామని అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కారకర్తల కేటీఆర్ ఉన్నారు. నూతన మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఇక ఈసారి వచ్చేది బీఆర్ఎస్సేనని.. కేసీఆర్ మళ్లీ సీఎం అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాబోయే ఎన్నికల వ్యూహాలపై మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏ పార్టీతోనూ బీఆర్ఎస్కు పొత్తులు లేదా సర్దుబాట్లు ఉండబోవని కేటీఆర్ చెప్పారు. తమకు పొత్తులతో కలిసి రాదని, కుదరదని పేర్కొన్నారు.
2027 నుంచి తాను పాదయాత్ర ప్రారంభిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉనికిలో ఉన్న పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తానని. ఇక పార్టీ పేరు మార్పుపై వస్తున్న వార్తలపై కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చాలనేది ప్రజల నుంచి వస్తున్న బలమైన కోరిక అని ఆయన అంగీకారం తెలిపారు. అయితే పార్టీలో నిర్ణయాలన్నీ కేసీఆర్ నాయకత్వంలోనే జరుగ అన్నారు. ఆయన ఏది చెబితే అదే ఫైనల్ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇక డీలిమిటేషన్తో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 179 కు అలాగే పార్లమెంట్ స్థానాలు 28 కు పెరుగుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యత విపరీతంగా పెరిగిందని.. మేధావులు అనుకున్నవాళ్లు ఇప్పుడు మాట్లాడటం లేదని అన్నారు. నలుగురు సీఎంలు చరిత్రలో నిలిచిపోయేలా పాలించారని.. వారే ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు, కేసీఆర్ అని కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి లో జరిగిన సమావేశం అనంతరం కేటీఆర్ చిట్ చాట్ మీడియాతో మాట్లాడారు. అన్ని పథకాల్లో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird