[ad_1]
అంతర్జాతీయ
-బొమ్మ శివకుమార్
ఇరాన్ తో చర్చలు విఫలమైన నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ కు తాజాగా ఇరాన్ ఘాటుగా బదులిచ్చింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆదివారం ప్రకటించారు. శత్రువులు ఎలాంటి తప్పు చేసినా ప్రమాదకర పరిణామాలు తప్పవని హెచ్చరించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా నేవీకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇరాన్ ఈ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఇరాన్ సామర్థ్యం అన్ని సముద్రయాన కదలికలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నాయి. గార్డ్స్ నావికా కమాండ్ ఎక్స్ లో పర్షియన్ భాషలో పోస్ట్ చేస్తూ.. "ఈ మార్గంలోని ట్రాఫిక్ అంతా సాయుధ నియంత్రణలో ఉంది" అని స్పష్టం చేసింది. అంతేకాదు.. "శత్రువు తప్పుడు అడుగు వేస్తే.. జలసంధిలోని ప్రాణాంతక సుడిగుండంలో చిక్కుకోవడం ఖాయం" అని కూడా హెచ్చరించింది.
ఈ బలమైన హెచ్చరికలతో పాటు, క్రాస్ హెయిర్లలో ఉన్న నౌకలను చూపిస్తున్న ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది ఇరాన్. తాజా పరిణామాలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింతగా పెంచాయి. అంతకుముందు ఇరాన్‌తో యుద్ధం ముగించేందుకు అమెరికా చేసిన చర్చలు విఫలమైన సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ జలమార్గంలోకి ప్రవేశించడానికి లేదా నిష్క్రమించడానికి ప్రయత్నించే అన్ని నౌకలను అమెరికా నెవీ తక్షణమే దిగ్బంధించడం ప్రారంభిస్తుందని ట్రంప్ హెచ్చరిక. అయితే ట్రంప్ వార్నింగ్ పై తాజాగా ఇరాన్ ఘాటుగా బదులిచ్చింది.

ఇక పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దాంతో అమెరికా, ఇరాన్ బృందాలు అక్కడినుంచి వెళ్లిపోయాయి. చర్చలు విఫలమైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏర్పాటు. ఇస్లామాబాద్ వేదికగా దాదాపు 21 గంటలకు పైగా జరిగిన చర్చలు విఫలం అయ్యాయని పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికా పెట్టిన డిమాండ్స్ కారణంగానే చర్చలు విఫలమయ్యాయని చెబుతోంది.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird