
వ్యాపారం
ఓయ్-చంద్రశేఖర్ రావు
అంతర్జాతీయ చమురు మార్కెట్లలో తీవ్ర అస్థిరత. ఇస్లామాబాద్ లో సాగిన చర్చలు విఫలం కావడంతో ముడిచమురు ధర మళ్లీ మొదటికొచ్చింది. మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రెట్టింపు అవుతున్నాయి. హార్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు, ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్బంధించాలని నిర్ణయించడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. వీటి ప్రభావం ముడిచమురుపై పడుతోంది. క్రూడాయిల్ రేట్లు పెరుగుతున్నాయి.
ఈ పరిస్థితుల మధ్య దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేటి తాజా పెట్రోల్, డీజిల్ ధరల వివరాలను ప్రకటించాయి. వీటి రేట్లల్లో ఎటువంటి సవరణలు చేయలేదు. అంతర్జాతీయంగా అస్థిరత పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేశాయి. ధరల భారం పడకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొంతవరకు క్రూడ్ రేట్ల పెరుగుదలను భరిస్తున్నట్లు ఉన్నాయి. ఇది ద్రవ్యోల్బణ ఒత్తిళ్ళను అదుపులో ఉంచడానికి.

ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్తో కూడిన మధ్యాచ్య సంఘర్షణ కారణంగా గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు అధిక అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% వాటా కీలకమైన చోక్పాయింట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా చమురు రవాణాకు అంతరాయాలు కలుగుతాయనే ఆందోళనలు ఈ సంక్షోభం లేవనెత్తుతోంది. అంతర్జాతీయ చమురు ధరలు దీర్ఘకాలం పాటు కొనసాగితే, చమురు కంపెనీలు నష్టాలను భరించడం కష్టంగా మారుతుంది.
నేడు వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలు ఉన్నాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61
భువనేశ్వర్లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52