
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
భానుడి ప్రతాపం రోజురోజుకీ పెరుగుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. వడగాల్పులు వీస్తు న్నాయి. అధిక స్థాయిలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో మరింతగా ఎండ తీవ్రత పెరుగుతుందనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటి పూడ బడులు కొనసాగుతున్నాయి. అయితే, బడి వదిలే సమయం వేళ ఎండ తీవత్ర విద్యార్ధుల పైన పడుతోంది. దీంతో.. ఇప్పుడు ఒంటి పూట బడుల వేళల మార్పుపై ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కరి అవుతున్నారు. పలు జిల్లాల్లో ఉక్క పోతే తీవ్రంగా ఉంటోంది. ఉదయం 8 గంటల తరువాత బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సి వస్తోంది. కాగా, వేసవి ప్రభావం పెరుగుతున్న వేళ ప్రభుత్వం ఒంటిపూట బడులు అమల్లోకి తెచ్చింది. మార్చి 16వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నడుస్తున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వ ప్రకారం ప్రతిరోజూ ఉదయం 7:45 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే క్లాసులు ఉన్నాయి. కొన్ని ప్రయివేటు విద్యా సంస్థలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో విద్యార్ధులకు ఎండ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఐడెడ్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం పాఠశాల ప్రారంభ సమయంలో యథావిధిగా రాగిజావ, మధ్యాహ్నం తరగతులు ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించాలని నిర్దేశించింది.

ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల వినతి
కాగా, ఈ నెల 23వ తేదీ వరకు ఒంటి పూట బడులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఖరారు చేసారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో పరీక్షలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతోంది. తెలంగాణ లో ఇంటర్ ఫలితాలు. ఏపీలో ఈ నెల 18 లేదా 19న ఇంటర్వెల్ ప్రకటించనున్నారు. కాగా.. పెరుగుతున్న ఎండ తీవ్రత వేళ ఒంటి పూట బడుల నిర్వహణ వేళల మార్పుపై ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతులు అందుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 11 గంటల వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఏపీలో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్న వేళ విద్యార్ధులు వేడి తీవ్రతను తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం మేరకు. కాగా, వేసవి సెలవులు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం ఇప్పుడు ఒంటి పూట బడుల వేళల్లో మార్పు చేస్తుందా.. ఈ వినతుల వేళ ప్రభుత్వం అధికారికంగా తీసుకోవాల్సి ఉంది.