[ad_1]
తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వేసవిలో ఎండల తీవ్రత కారణంగా లబ్దిదారుల కోసం కొత్త నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన రేషన్ సరుకుల కోటాను ఈ నెలలోనే లబ్దిదారులకు అందించనుంది. ఇలా మూడు కోటాను రేషన్‌కార్డుదారులు ఒకేసారి తీసుకోవచ్చు.అదే సమయంలో లబ్దిదారులకు ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు స్పష్టత ఇచ్చారు.
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రేషన్ ప్రభుత్వం ఒకే సారి అందిస్తోంది. దీంతో.. రేషన్ వద్ద భారీగా రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం. మూడు కోటాను రేషన్‌కార్డుదారులు ఒకేసారి తీసుకోవచ్చు. సాధారణంగా నెలలో 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేస్తారు. కానీ మూడు రేషన్ ఒకేసారి అందిస్తామంటూ మరిన్ని నెలల సమయం ఇవ్వనున్నారు. ఇందు కోసం ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీకి సిద్దమైంది. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ మొదలవ్వడంతో సర్వర్లలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. సర్వర్లపై ఒత్తిడి పెరగడం వల్ల ఈ పోస్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. దీంతో, రద్దీ నియంత్రణతో పాటుగా లబ్దిదారుల్లో ఆందోళన తొలిగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రేషన్ పొందేందుకు డీలర్ల వద్ద పెద్ద సంఖ్యలో క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో కూలీ పనులు మానుకుని మరీ రేషన్ షాపుల వద్ద గంటల పాటు వేచి ఉన్నారు. ఇప్పుడు రేషన్ తీసుకోకపోతే మరో మూడు నెలల వరకు రాదనే ఆందోళనతో షాపులకు పరుగులు తీస్తున్నారు. దీంతో, ఈ రద్దీ నియంత్రణతో పాటుగా అందరికీ రేషన్ అందేలా చర్యలు తీసుకుంటోంది. దీని భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 15వ తేదీ వరకు ప్రతీ నెలా రేషన్ ఇస్తా.. సమయం సమీపిస్తున్న వేళ రద్దీ పెరుగుతోంది. దీంతో.. నెలాఖరు వరకు ఈ అవకాశం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వృద్దులు, మహిళలు రేషన్ సరుకుల కోసం గంటల తరబడి ఉండలేక అవస్థలు పడుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టారు. రేషన్ సరుకుల స్టాక్ తగినంత స్థాయిలో ఉండదని, ఎప్పటికి అప్పుడు డిమాండ్‌కు అనుగుణంగా స్టాక్ పంపిణీ జరుగుతుందని స్పష్టం చేసారు.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird