Vrm media ప్రతినిధి ఖమ్మం
ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో 24 సంవత్సరాల తర్వాత, ఉత్తీర్ణత సాధించిన స్వాతి.
ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ, మాది పాల్వంచ నేను 2002లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకునే సమయంలో నాకు వివాహం జరిగింది. వివాహ అనంతరం నా భర్త పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్న తరుణంలో, వివిధ ప్రాంతాలకు బదిలీ అవుతుండడం. వలన నాకు సంసార బాధ్యతలు పెరిగి, పిల్లలు వారి ఆలనా, పాలన చూసుకోవడం మరియు వారికి విద్యాబుద్ధులు నేర్పించడం లో
నా జీవితం కొనసాగింది. నా భర్త తిరుమణి రవికుమార్ ఖమ్మం లో ట్రాఫిక్ ఎస్.ఐ గా పనిచేస్తున్నారు. వారు అందించిన ప్రోత్సాహంతో, 2002 లో ఇంటర్మీడియట్ పూర్తిస్థాయిలో చదువు ఆపేసిన నాకు, చదువు మీద ఆసక్తి ఉంది అని, సమాచారం ఇవ్వడంతో 2026 లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు కట్టి నేను పరీక్షలకు సిద్ధమయ్యేలా నన్ను ప్రోత్సహించారు. ఈ రోజు విడుదలైన ఫలితాలలో నాకు
24 ఏళ్ల కళగా మిగిలిపోయిన, ఇంటర్మీడియట్ పరీక్షలలో మొదటి
ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాను అని, ఆనందం వ్యక్తం చేసారు. తనలాగా ఎన్నో కారణాలతో చదువు ఆపేసిన,
ప్రతి మహిళకు ఇది ఒక ప్రేరణగా ఉండాలని ఆకాంక్షించారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird