Home ట్రెండింగ్ ఆంటీ వేధింపులు తట్టుకోలేక కుర్రాడు సూసైడ్.. ఏం జరిగిందంటే..? | బెంగుళూరు షాక్ 42 ఏళ్ల వివాహిత మహిళ బ్లాక్ మెయిల్ కారణంగా 28 ఏళ్ల జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకుంది. – VRM MEDIA

ఆంటీ వేధింపులు తట్టుకోలేక కుర్రాడు సూసైడ్.. ఏం జరిగిందంటే..? | బెంగుళూరు షాక్ 42 ఏళ్ల వివాహిత మహిళ బ్లాక్ మెయిల్ కారణంగా 28 ఏళ్ల జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకుంది. – VRM MEDIA

by VRM Media
0 comments
ఆంటీ వేధింపులు తట్టుకోలేక కుర్రాడు సూసైడ్.. ఏం జరిగిందంటే..? | బెంగుళూరు షాక్ 42 ఏళ్ల వివాహిత మహిళ బ్లాక్ మెయిల్ కారణంగా 28 ఏళ్ల జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకుంది.


భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

42 ఏళ్ల ఆంటీ వేధింపులకు తట్టుకోలేక 27 ఏళ్ల కుర్రాడు మృతి చెందిన ఘటన బెంగళూరులో జరిగింది. వివాహిత నుంచి వచ్చిన వేధింపుల కారణంగానే అతడు మృతి చెందినట్లు సమాచారం. మృతుడు దిలీప్‌గా పోలీసులు పేర్కొన్నారు. అతడు ఓ జిమ్ ట్రైనర్ అని తేలింది. ఈ ఘటన శనివారం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివాహిత దిలీప్ సోదరికి ఓ మెసేజ్ పెట్టడంతో హుటాహుటిన ఆ కుటుంబ సభ్యులు దిలీప్ ఉంటున్న రూమ్ కు చేరుకున్నారు. అప్పటికే డోర్ లోపలి నుంచి లాక్ చేశాడు దిలీప్. రూమ్ లోపల సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలీప్ ఓ జిమ్ ట్రైనర్. అయితే అదే జిమ్ లో రెండేళ్ల క్రితం ఆ వివాహిత ఫిట్ నెస్ కోసం జాయిన్ అయింది. అక్కడి నుంచి మధ్య పరిచయం కాస్తా ఇద్దరి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ దిలీప్ తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆమెను అన్ ఫ్రెండ్ చేశాడు. అయితే చనిపోయే రోజు మాత్రం ఆ మహిళకు వీడియో కాల్ చేశాడు. తాను చనిపోతున్నట్లు తెలిపాడు. ఇదే పరీక్ష ఆ మహిళ వెంటనే దిలీప్ సోదరికితో వాళ్లు దిలీప్ రూమ్ కు వెళ్లి చూస్తే అప్పటికే అతను దిలీప్ సూసైడ్ చేసుకున్నాడు.

బెంగుళూరు షాక్ 42 ఏళ్ల వివాహిత మహిళ బ్లాక్ మెయిల్ కారణంగా 28 ఏళ్ల జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇక ఇదే విషయంపై దిలీప్ ఫ్యామిలీ ఆ మహిళపై ఆరోపణలు చేస్తున్నారు. ఆ మహిళ దిలీప్ ను డబ్బు, ప్రాపర్టీ కావాలని బ్లాక్ మెయిల్ చేసిందని అంటున్నారు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం బహిర్గతం అయిందని పోలీసుల సమక్షంలో ఆ మహిళ భర్త, దిలీప్ మధ్య సంవత్సరం క్రితం రాజీ కుదిరిందని అన్నారు. కానీ అప్పటి నుంచి తమ కుమారుడిని బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నారని దిలీప్ తల్లిదండ్రులు వాపోయారు. తమ కుమారుడి చావుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై నేలమంగళ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

2,801 Views

You may also like

Leave a Comment