VRM మీడియా న్యూస్
సత్తుపల్లి ప్రతినిధి | ఖమ్మం జిల్లా
తేదీ: 15 ఏప్రిల్, 2026
సత్తుపల్లిలో అభివృద్ధి పనుల వెల్లువ – నూతన అధ్యాయం


సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ప్రత్యేక చొరవతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై అభినందనలు తెలిపారు.
ఆరోగ్య రంగంలో భాగంగా సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రి, కల్లూరు, పెనుబల్లిలో ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించారు. అలాగే నారాయణపురం, రేజర్ల, వెంకటాపురం గ్రామాల్లో విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేసి మౌలిక సదుపాయాలను బలోపేతం చేశారు.
పెనుబల్లి మండలంలోని పులిగుండాల ఎకో టూరిజం అభివృద్ధికి కూడా చర్యలు చేపట్టారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన సభకు భారీగా ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు సత్తుపల్లి అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇవ్వగా, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird