[ad_1]
తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
రైతు రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లా నస్తూరుపల్లి సభ వేదికగా రూ. 5,563 కోట్లు విడుదల చేశారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. నిధుల విడుదల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ.. దేశంలోనే రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
"రూ. 2లక్షల రుణమాఫీ ప్రకటించి ఏడాదిలోపే చేసి చూపించాం. 22.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ. 22 వేల కోట్లు వేశాం. గత విడతలో రైతు భరోసా కింద రూ. 9 వేల కోట్లు జమ చేశాం. మిగిలిన రోజుల్లో రూ. 3,300 కోట్లు సీఎం వచ్చే నెలలోపే చేసి చూపించాం. రెడ్డి అన్నారు.
"ప్రజాపాలన పోవాలి.. పాపాల భైరవుడు రావాలని ఓ పెద్ద మనిషి అంటున్నాడు. ఫామ్ హౌజ్‌లో పడుకునే పాపాల భైరవుడు మళ్లీ ఎందుకు రావాలి. లక్షలాది మంది కార్యకర్తలు రక్తాన్ని చమటగా మార్చి భుజాలు కాసేలా జెండా మోస్తే ప్రభుత్వం వచ్చింది. పాపాల భైరవుడు ఎందుకు రావాలి.. 40 ఏళ్ల పాటు తన కుటుంబానికి పదవులు ఇచ్చుకున్నారు.’’ అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

"పదేళ్ల పాలనలో బిడ్డ, కొడుకు, తండ్రి ఇలా తలా ఓ ఫామ్ హౌజ్ నిర్మించుకున్నారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా..? 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు ప్రజా పాలన పోవాలా..? వరి వేస్తే ఊరి.. అని పంటని కొనేదే లేదన్న నేత మళ్లీ రావాలా..? పోవాలా..?" అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. 2029 లో కేసీఆర్ నువ్వో నేనో చూస్కుందాం.. అని సవాల్ విసిరారు.
"2029 ఎన్నికల్లో తేల్చుకుందాం.. దమ్ముంటే రండి అంటూ బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ సవాల్ చేశారు. కేసీఆర్ కు ఉన్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే తన పేరు మార్చుకుంటానన్నారు. 'దేశంలోనే అత్యధిక మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తామని. ఇక్కడ 15 మంది ఎంపీలను గెలిపించి రాహుల్‌ను ప్రధానిని చేయిస్తాం' అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి 'తోడేలు బయటకెళ్లారు.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird