Home Uncategorized బస్సు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తాం

బస్సు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తాం

by VRM Media
0 comments

VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం తేది;09-05-2026, శనివారం

బస్సు ప్రమాదాలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలి

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి

బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధి కారులకు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి సూచించారు. భద్రాచలం నుండి కాకినాడ వెళ్తున్న బస్సు చిన్న గెద్దాడ వద్ద శనివారం ప్రమాదానికి గురైంది. సదరు సంఘటన విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ ,ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి హుటాహుటీన రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆమె పరామర్శించారు. గాయపడ్డ ప్రతీ క్షతగాత్రుని వద్దకు వెళ్ళి పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరుపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎలాంటి మెరుగైన వైద్యం అవసరం అయితే రాజమండ్రి, కాకినాడ రిఫర్ చేయాలని సూచించారు. ప్రమాద ఘటన పై స్థానిక పోలీసులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా సక్రమంగా వైద్య సేవలు అందించాలని కోరారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న విషయంలో పోలీసులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఆమె వెంట తెదేపా నియోజక వర్గ ఎస్టీ విభాగం అధ్యక్షులు పండా చెల్లన్న దొర అనే బాబీ, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు అడబాల బాపిరాజు, తెదేపా నేతలు మువ్వా శ్రీను, జి.నారాయణ, ప్రాంతీయ ఆసుపత్రి పర్యవేక్షకులు బి .రాహుల్, రంప చోడవరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ నిర్మల కుమారి తదితరులు పాల్గొన్నారు.

2,813 Views

You may also like

Leave a Comment