Home Uncategorized ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి….. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి….. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

by VRM Media
0 comments

vrm media ప్రతినిధి ఖమ్మం

*ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, మే 11:

ప్రజలు సమస్యలు తెలుపుతూ సమర్పించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ జిల్లా అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు.

తల్లాడ మండలం కలకొడిమ గ్రామానికి చెందిన మనుబోలు రామారావు తన ఇంటికి వెళ్లే పంచాయతీ రోడ్డుకి ముళ్ళ కంప వేసి ప్రజా రహదారిని అడ్డగించడం గురించి ఫిర్యాదు చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకోగా, జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

మధిర మండలం వెంకటాపురం, వంగవీడు, సిరిపురం గ్రామాలకు చెందిన పలు రైతులు పాలవాగు తర్వాత వచ్చు భగవానుల పురం గ్రామం వెళ్ళు స్టేజి నుండి ఆర్ అండ్ బి రోడ్డు ఎడం ప్రక్కన వరద వెళ్ళుటకు వేసిన పైపులు గత ఏడాది డ్యామేజ్ అయ్యాయని, ఒకవైపు మాత్రమే మళ్లీ పైపులు వేసారని రెండోవైపు పూడ్చివేసారని దానివల్ల వర్షం పడినప్పుడు నీరు వాగు వైపుకు రావటం లేదని, పాత పైపులు తీయకపోతే తమకు చాలా నష్టం జరుగుతుందని న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, సత్తుపల్లి ఈఈ ఆర్ అండ్ బి కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఖమ్మం పట్టణానికి చెందిన పగిళ్ళ రాము తనకు దివ్యాంగుల కోటాలో మీసేవ సెంటర్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఈడిఎంకు రాస్తూ అవకాశం మేరకు పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు.

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఖమ్మం జిల్లా అధ్యక్షులు డి. నాగరాజు ఖమ్మం నగరానికి చెందినటువంటి నిరుపేద దివ్యాంగుల కుటుంబానికి చెందిన పదిమంది దివ్యాంగులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పిడి హౌసింగ్ కు రాస్తూ రెండవ జాబితాలో పరిశీలించి అర్హత మేరకు మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు.

ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

2,810 Views

You may also like

Leave a Comment