[ad_1]

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (రామ్ చరణ్), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (పెద్ది). ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. చరణ్ క్రేజ్, బుచ్చిబాబు మేకింగ్ పై ఉన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరలకు హక్కులను దక్కించుకుంటున్నారు.
ఏరియా వైజ్ బిజినెస్ వివరాలు:
విశ్వసనీయ సమాచారం ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో 'పెద్ది' సినిమా బిజినెస్ రూ.163 కోట్లకు క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ (నైజాం) ఏరియా హక్కులు దాదాపు రూ.63 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇది రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యుత్తమ డీల్స్ లో ఒకటిగా నిలిచింది. ఆంధ్రా థియేట్రికల్ హక్కులు సుమారు రూ.75 కోట్లు పలికినట్లు సమాచారం. ఇక సీడెడ్(రాయలసీమ) ఏరియాలో ఈ చిత్రం రూ.25 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ట్రేడ్ టాక్.
అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.163 కోట్ల మార్కును తాకింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
భారీ అంచనాల మధ్య 'పెద్ది'
ఈ రామ్ సినిమాలో చరణ్ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్ లో కనిపిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తే సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో బజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన అప్డేట్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మే 18న ట్రైలర్ విడుదల. ఈ భారీ బిజినెస్ రికార్డులను బట్టి చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా ఏర్పడింది.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird