VRM మీడియా అయినవిల్లి భద్రం
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన 'ప్రతి బుధవారం స్వచ్ఛ పథం' కార్యక్రమం రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామంలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొని, స్వయంగా పారిశుధ్య పనుల్లో భాగస్వాములయ్యారు.
"గ్రామాలు శుభ్రంగా.. రహదారులు అందంగా.. మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంగా" అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే స్వయంగా చెత్తను తొలగిస్తూ, డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయిస్తూ గ్రామస్తుల్లో చైతన్యం నింపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే అది ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరించారు. "పరిసరాల్లో పేరుకుపోయే ప్లాస్టిక్ మరియు వ్యర్థాల వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి" అని ఆయన పిలుపునిచ్చారు.
ప్రతి బుధవారం ఈ పారిశుధ్య కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించాలని, తద్వారా అంటువ్యాధులు దరిచేరకుండా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని సూచించారు. మన ఊరు - మన బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీధులను శుభ్రం చేశారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird