VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల కేంద్రంలో
ఈరోజు 16/5/26 వ తేదీన ఒంటిమిట్ట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు భావన రెడ్డి అరుణ జ్యోతి మరియు సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం గురించి మండల గ్రామ ప్రజలకు ఆరోగ్య బోధన చేయడం జరిగినది ఈ సందర్భంగా సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవం కనుక డెంగ్యూ వ్యాధి చాలా ప్రమాదకరమైనదని ప్రాణాంతకరమైనదని కనుక ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత తప్పకుండా పాటించాలని ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలని ఇండ్ల చుట్టూ మురికి నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని గ్రామ ప్రజలకు వివరించడం జరిగినది ఈ డెంగ్యూ దోమ శుభ్రమైన నీటిలో అభివృద్ధి చెందుతుందని కనుక ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి ఇంటిలోని నీటినంత పారద్రోసి కొత్తగా నీరు నింపుకోవడం వల్ల ఈ దోమలు అభివృద్ధి చెందకుండా అవి మనల్ని కుట్టకుండా ఉంటాయని అక్కడికి గ్రామ ప్రజలకు వివరించడం జరిగినది మరియు గ్రామ ప్రజల చేత డెంగ్యూ నివారణ ర్యాలీ మరియు ప్రతిజ్ఞ చేయించడం జరిగినది ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ వెంకటసుబ్బమ్మ సూపర్వైజర్ సుజాత హెల్త్ అసిస్టెంట్ వెంకటసుబ్బయ్య ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగినది


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird