[ad_1]
భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బోగీలో మంటలు చెలరేగాయి. మంటలను ముందుగానే గమనించడంతో భారీ ప్రమాదం తప్పింది. రైలును తక్షణమే నిలిపివేశారు. ప్రమాదానికి గురైన బోగీ నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు.
తిరువనంతపురం సెంట్రల్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ మధ్య రాకపోకలు సాగించే నంబర్ 12431 రాజధాని ఎక్స్ ప్రెస్ అది. శుక్రవారం 7:15 నిమిషాలకు తిరువనంతపురం నుంచి సాయంత్రం బయలుదేరింది. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరాల్సి ఉంది. మార్గమధ్యలో కోట వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. ఈవారు జామున అయిదు గంటల సమయంలో బీ1 కోచ్, తెల్ల ఇంజిన్ కంపార్ట్మెంట్లలో మంటలు చెలరేగాయి.

ఆ వెంటనే ప్రయాణికులందరినీ వెంటనే సురక్షితంగా ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అగ్నిప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడానికి కోటా స్టేషన్లో అమర్చిన ఆటోమేటెడ్ హూటర్ మొగడంతో స్థానిక రైల్వే యంత్రాంగానికి వెంటనే సమాచారం చేరింది. తక్షణమే స్యందించిన సీనియర్ రైల్వే అధికారులు, సహాయక బృందాలతో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ రైలులో కేరళకు చెందిన ప్రయాణికులు ఉన్నారు.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird