[ad_1]
భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
కర్ణాటకలోని కొడగు జిల్లా దుబారే ఎలిఫెంట్ క్యాంప్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఏనుగు టూరిస్టు మీద పడిపోవడంతో అక్కడికక్కడే ఆ టూరిస్టు మృతి చెందింది. దుబారే ఎలిఫెంట్ క్యాంప్‌లో రోజూ మాదిరిగానే కావేరీ నదిలో ఏనుగులకు స్నానం చేపిస్తుండగా కాంచన్, మార్తాండ అనే రెండు ఏనుగులు ఘర్షణకు దిగాయి. ఒకదానిపై మరొకటి దాడి జరిగింది. దీంతో ఆ ఏనుగుల పక్కనే ఉన్న తమిళనాడుకు చెందిన పర్యాటకురాలు తులసి ఒక్కసారిగా భయపడిపోయి పరిగెత్తితే కింద పడిపోయింది. అదే సమయంలో ఆమెపై ఏనుగు పడింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ప్రమాద సమయంలో మృతురాలి భర్త, పిల్లలు పక్కనే ఉన్నారు. కానీ వాళ్లు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. సరదాగా పిల్లలతో వచ్చిన ఆ కుటుంబంలో విషాదం. పిల్లలు, భర్త ముందే ఆమె ప్రాణాలు కోల్పోయాయి. రెండు ఏనుగులు దాడి చేస్తున్న సమయంలో ఓ ఏనుగుపై మావటివాడు ఉన్నాడు. కానీ ఏనుగును అదుపు చేయలేకపోయాడు. దాంతో ఓ ఏనుగు కింద పడిపోగా.. ఆ ఏనుగు కింద సదరు మహిళ నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందింది.
#కొడగు ఇంతలో విషాదకర సంఘటన జరిగింది #ఏనుగు స్నానం వద్ద #దుబారే క్యాంప్ నుండి 33 ఏళ్ల మహిళ #చెన్నై అక్కడికక్కడే మృతి చెందాడు@aranya_kfd@ేశ్వర్_ఖండ్రే @బోస్కీ ఖన్నా @prajna_gr pic.twitter.com/73skY5l9ZU
— అమిత్ ఉపాధ్యాయే (@AmitSUpadhyae) మే 18, 2026
ఈ ఘటన సమయంలో పర్యాటకులు అంతా ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ పరుగులు తీశారు. ఇక ఇప్పటికే ఓ ఏనుగు కింద పడిపోవడంతో రెండు ఏనుగుల మధ్య ఘర్షణ తగ్గింది. లేదంటే మరింత ప్రాణనష్టం వాటిల్లేది. ఇక ఆ మహిళ మృతి పట్ల కర్నాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బీ ఖండే నివాళులు అర్పించారు. ఈ ఘటనపై విచారణకు అధికారులు విచారణ చేపట్టారు. శిక్షణ పొందిన పెంపుడు జంతువులు కూడా ఒక్కోసారి ఊహించినపుడు ఊహించని విధంగా ప్రవర్తించవచ్చు. వన్యప్రాణుల శిబిరాల్లో జంతువులకు అతి సమీపంగా పర్యటకులు వెళ్లకుండా తక్షణమే మార్పులు చేర్పులు.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird