[ad_1]
సోషల్ మీడియాలో “కుర్చీ తాత”గా ప్రసిద్ధి చెందిన వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని సమాచారం.
కుర్చీ తాతకు సంబంధించిన వీడియోలు, మీమ్స్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ కావడంతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కింద పడుకొని ఉన్న కుర్చీ తాత చుట్టూ కుటుంబ సభ్యులు ఉండి ఆయన్ని పలకరిస్తున్నట్టుగా ఉన్న ఈ వీడియోను చూస్తే ఆయన పరిస్థితి ఆందోళన కరంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird